Cash Deposit Limit In Bank Account :మనలో చాలా మందికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రోజులో మన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు వేయవచ్చు? ఒక ఆర్థిక సంవత్సరంలో మన బ్యాంక్ ఖాతాలో ఎంత సొమ్ము డిపాజిట్ చేయవచ్చు? అని. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇన్‌కం టాక్స్ రూల్స్ ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో మన సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు మించి డబ్బులు డిపాజిట్ చేసినా, లేదా విత్‌డ్రా చేసినా కచ్చితంగా ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు వస్తాయి.
ఒక రోజులో ఎంత డిపాజిట్ చేయవచ్చు?
How Much Cash Can Deposit In A Savings Account :ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, ఒక రోజులో రూ.2 లక్షలకు మించి మన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయకూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 269ఎస్‌టీ ప్రకారం, ఒక రోజులో ఒక ఈవెంట్‌కు సంబంధించి, ఒక వ్యక్తి నుంచి మరోవ్యక్తి నగదు రూపంలో రూ.2 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే, కచ్చితంగా ఆదాయ పన్ను శాఖ నుంచి మీకు నోటీస్ వస్తుంది.
ఇది గుర్తుంచుకోండి!
చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటాయి. అయితే ఆ ఖాతాలన్నింటినీ కలిపినా ఒక ఏడాదిలో రూ.10 లక్షలకు మించి ఆర్థిక లావాదేవీలు జరగకూడదు. ఒకవేళ జరిగితే ఆ విషయాన్ని బ్యాంకులు - ఆదాయ పన్ను శాఖకు తెలియజేస్తాయి. అంటే మీ దగ్గర ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ, ఒక ఆర్థిక సంవత్సరంలో వాటన్నింటి ద్వారా మీరు రూ.10 లక్షలకు మంచి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.
రూ.10 లక్షలకు మించి ఆర్థిక లావాదేవీలు చేస్తే ఏమౌతుంది?
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి మీ పొదుపు ఖాతాలో డిపాజిట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు దానిని బ్యాంకులు హై-వాల్యూ ట్రాన్సాక్షన్‌గా పరిగణిస్తాయి. వెంటనే ఇన్‌కం ట్యాక్ యాక్ట్ -1962 సెక్షన్ 114బీ ప్రకారం, సదరు ఆర్థిక లావాదేవీల వివరాలను బ్యాంకులు ఆదాయ పన్ను శాఖ వారికి తెలియజేస్తాయి. అలాగే ఒక రోజులో మీరు రూ.50,000లను మీ పొదుపు ఖాతాలో డిపాజిట్ చేయాలని అనుకుంటే కచ్చితంగా మీ పాన్ కార్డ్‌ను బ్యాంక్‌కు అందజేయాలి. పాన్ కార్డ్ లేకపోతే ఫారమ్ 60/61ను సబ్మిట్ చేయాలి.