తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ లాంఛ్ డేట్​ ఫిక్స్డ్​ - కియా & టయోటా కార్స్​ రీకాల్​ - ఎందుకంటే? - Hyundai Creta N Line India Launch

Hyundai Creta N Line India Launch Date : హ్యుందాయ్ కంపెనీ క్రెటా ఎన్​ లైన్​ కారు లాంఛ్ డేట్​ను ప్రకటించింది. మరోవైపు కియా, టయోటా కంపెనీలు తమ కార్లను రీకాల్ చేశాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Kia Seltos Recall
Hyundai Creta N Line India Launch Date

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 4:51 PM IST

Hyundai Creta N Line India Launch Date :ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ తమ లేటెస్ట్​ క్రెటా ఎన్​ లైన్​ కారును మార్చి 11న లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఎస్​యూవీ కారులో పలు కాస్మొటిక్​, మెకానికల్ అప్​డేట్స్ చేసినట్లు పేర్కొంది. త్వరలోనే కంపెనీ అధికారిక వెబ్​సైట్లు, డీలర్​షిప్​ల వద్ద బుకింగ్స్ ఓపెన్ చేస్తామని కూడా తెలిపింది. ప్రస్తుతానికి మార్కెట్లో క్రెటా ఎన్​ లైన్ కారుకు పోటీ ఇచ్చే కార్లు ఏవీ లేకపోవడం విశేషం.

కాస్మొటిక్ అప్​డేట్స్ : హ్యుందాయ్​ క్రెటా ఎన్​ లైన్ కార్​ బంపర్లను మార్చారు. రెగ్యులర్ క్రెటాలో 17 అంగుళాల వీల్స్ ఉంటే, ఈ అప్​డేటెడ్​ క్రెటాలో 18 అంగుళాల చక్రాలను అమర్చారు. అంతేకాదు మాట్​ గ్రే, బ్లూ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలోనూ దీనిని తీసుకువస్తున్నారు.

ఇంటీరియర్ డిజైన్​ : హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ కారు లోపల ఇప్పటి వరకు డ్యూయల్-టోన్ కలర్స్ ఉండేవి. కానీ అప్​డేటెడ్​ వెర్షన్​లో ఇంటీరియర్ మొత్తం బ్లాక్​ కలర్​లో ఉంటుంది. ఎన్​ లైన్ బ్యాడ్జింగ్​, స్పోర్టీ ఆప్పీల్​ను పెంచడానికి సీట్లపై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ చేశారు. గేర్​ లివర్​ను కూడా ఏర్పాటు చేశారు. బహుశా డ్యాష్​-కామ్ కూడా ఉండే అవకాశం ఉంది.

మెకానికల్ అప్​డేట్స్​ :ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్​ లైన్​ కారులో డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్​ను మరింత పెంచడానికి అనేక మెకానికల్ అప్​డేట్స్ చేశారు. అప్​డేటెడ్​ స్టీరింగ్​, స్పోర్టియర్​ ఎగ్జాస్ట్​ సహా ట్యూన్డ్​ సస్పెన్షన్​ దీనిలో ఏర్పాటు చేశారు. ఈ కారులో 1.5 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 158 bhp పవర్​, 253 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్​ 7-స్పీడ్ డ్యూయెల్​ క్లచ్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానం చేయబడి ఉంది. అయితే 6-స్పీడ్​ మాన్యువల్ గేర్​బాక్స్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.

Hyundai Creta N Line Price : రెగ్యులర్ హ్యుందాయ్ క్రెటా కారు కంటే ఈ అప్​డేటెడ్ వెర్షన్ ధర రూ.50,000 నుంచి రూ.60,000 ఎక్కువ ఉండవచ్చు.

Kia Seltos Recall : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా తమ సెల్టోస్​ కార్లను రీకాల్ చేసింది. ముఖ్యంగా 2023 ఫిబ్రవరి 28 నుంచి జులై 13 మధ్య తయారు చేసిన 4358 కార్లను రీకాల్ చేసింది.

కియా కంపెనీ రూపొందించిన ఈ సెల్టోస్​ కార్లలో 1.5 లీటర్​ ఎన్​ఏ పెట్రోల్ విత్ సీవీటీ ట్రాన్స్​మిషన్ మోడల్స్​లో లోపాలు ఉన్నట్లు తేలింది. అందువల్ల ఈ ఎలక్ట్రానిక్​ ఆయిల్​ పంప్​ కంట్రోలర్​లోని లోపాలను సరిదిద్దడానికి కియా కంపెనీ స్వచ్ఛందంగా ఈ రీకాల్​ను ప్రకటించింది. పైగా దీనిని పూర్తి ఉచితంగా సరిదిద్ది కస్టమర్లకు అందజేస్తామని స్పష్టం చేసింది.

Kia Seltos Price : కియా సెల్టోస్​లో ప్రధానంగా 7 వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధర సుమారుగా రూ.10.90 లక్షలు - రూ.20.30 లక్షల వరకు ఉంటుంది.

Toyota India Recalls Land Cruiser 300 : టయోటా ఇండియా కంపెనీ మొత్తంగా 269 ల్యాండ్ క్యూయిజర్ 300 కార్లను రీకాల్ చేసింది. 'ఈ​ లగ్జరీ కారులోని ఆటోమేటిక్ టాన్స్​మిషన్​కు సంబంధించిన ఈసీయూ సాఫ్ట్​వేర్​లో లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసేందుకే రీకాల్ నిర్ణయం తీసుకున్నామని' టయోటా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతానికి ల్యాండ్ క్యూయిజర్ 300 కార్ల బుకింగ్​ను కూడా తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టం చేసింది. సాఫ్ట్​వేర్​లోని లోపాలను పూర్తి ఉచితంగా సరిచేస్తున్నట్లు తెలిపింది.

Toyota Land Cruiser Price : మార్కెట్లో టయోటా ల్యాండ్​ క్రూయిజర్ ధర సుమారుగా రూ.2.10 కోట్లు ఉంటుంది. ఈ కారులో 3.3 లీటర్​ వీ6 డీజిల్ మిల్ ఉంటుంది. ఇది 305 bhp పవర్​, 700 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్​ 10-స్పీడ్​ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది.

ABS ఫీచర్​తో బైక్ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

మారుతి కార్​ కొనాలా? ఆ మోడల్​ కోసం 4 నెలలు వేచిచూడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details