తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్ క్రెటా EV లాంఛ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్​ అదుర్స్- ధర ఎంతంటే? - HYUNDAI CRETA ELECTRIC SUV

2025లో భారత మార్కెట్​లోకి హ్యుందాయ్ క్రెటా ఈవీ- ధర, ఫీచర్ల వివరాలు ఇలా!

Hyundai Creta Electric SUV
Hyundai Creta Electric SUV (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 11:35 AM IST

Hyundai Creta Electric SUV Features : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్​ను 2025 జనవరిలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని హ్యూందాయ్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ ఓ కార్యక్రమంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. మరి హ్యుందాయ్ ఈవీ ఫీచర్లు ఏంటి? ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత వరకు ప్రయాణించవచ్చు? తదితర విషయాలు తెలుసుకుందాం.

డిజైన్ అండ్ ఇంటీరియర్స్
హ్యుందాయ్ క్రెటా మంచి డిజైన్​తో రానున్నట్లు స్పై షాట్స్ ఆధారంగా తెలుస్తోంది. హెడ్ లైట్లు, ఎల్ఈడీడీఆర్​ఎల్​లు యథాతథంగా గత మోడల్ మాదిరిగానే ఉంటాయని, ఈవీలో రేడియేటర్ గ్రిల్​కు బదులుగా క్లోజ్డ్ ఫ్రంట్ ఫేస్ ఉంటుందని ఇటీవలి స్పై షాట్స్ సూచించాయి. కారు వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్​లతో కనెక్ట్ అయిన లైట్ బార్ ఉండనున్నట్లు సమాచారం.

అదిరిపోయే ఫీచర్లు
క్రెటా ఈవీ కూడా 17 అంగుళాల ఏరో డైనమిక్ వీల్స్​ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంటిగ్రేటెడ్ సెటప్​లో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ ప్లేతో లభిస్తుంది. కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక రీపోజిషన్డ్ డ్రైవ్ సెలెక్టర్ కూడా లోడ్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.

ఫీచర్లు, భద్రత
హ్యుందాయ్ క్రెటా ఈవీలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రతాపరంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్‌ ఉంటాయని సమాచారం. హ్యుందాయ్ క్రెటా ఈవీలో ఆరు ఎయిర్‌ బ్యాగులు ఉండొచ్చని తెలుస్తోంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సెఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ధర ఎంతంటే?
హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.20 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, మారుతి ఈవీఎక్స్ వంటి వాటికి హ్యుందాయ్ క్రెటా ఈవీ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా 400 , 620కి.మీ రేంజ్ వరకు ప్రయాణించొచ్చని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details