How To Use Credit Cards For UPI Payments : యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్థిక లావాదేవీలు చాలా సులభమైపోయాయి. సమయానికి మన చేతిలో డబ్బులు లేకపోయినా, షాప్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, చాలా ఈజీగా బిల్లు చెల్లించేస్తున్నాం. అలాగే యూపీఐ యాప్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేయగలుగుతున్నాం.
సాధారణంగా యూపీఐ యాప్స్‌కు డెబిట్ కార్డులను లింక్ చేస్తూ ఉంటాం. కానీ క్రెడిట్ కార్డులను కూడా జత చేయవచ్చని మీకు తెలుసా? మీరు చదువుతున్నది నిజమే. క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసుకుని యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రూపే క్రెడిట్ కార్డ్స్‌తో యూపీఐ పేమెంట్స్!
ఇంతకు ముందు యూపీఐ ప్లాట్‌ఫామ్‌తో వీసా, మాస్టర్ కార్డులను మాత్రమే జతచేయడానికి వీలయ్యేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 జూన్ 8 తరువాత రూపే క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కనుక మీరు యూపీఐ యాప్స్‌కు రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకుని, పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Make UPI Payments Using Credit Card :
- ముందుగా మీకు నచ్చిన యూపీఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- ఉదాహరణకు Gpay, ఫోన్‌పే, పేటీఎం లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- తరువాత సదరు యూపీఐ యాప్‌లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తరువాత మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లను లింక్ చేయాలి.
- వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి.
- ఇవన్నీ పూర్తి చేసిన తరువాత యూపీఐ యాప్‌లోని మీ ప్రొఫైల్ లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- Set up payment methods లేదా add a payment methodపై క్లిక్ చేయాలి.
- మీ క్రెడిట్ కార్డ్ వివరాలు దానిలో నమోదు చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.
- అంతే సింపుల్! ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసేయవచ్చు. ఎలా అంటే?
- మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే, పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి అమౌంట్ ఎంటర్ చేయగానే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీరు క్రెడిట్ కార్డ్‌పై క్లిక్ చేస్తే, యూపీఐ పేమెంట్ జరిగిపోతుంది.
ఏయే క్రెడిట్ కార్డ్స్ వాడవచ్చు!
ఈ కింద ఇచ్చిన లిస్ట్‌లోని బ్యాంకులు అందించే రూపే క్రెడిట్ కార్డులను మీరు యూపీఐ పేమెంట్స్ కోసం వాడవచ్చు.
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్
2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. ఇండియన్ బ్యాంక్
4. హెచ్డీఎఫ్సీ బ్యాంక్
5. యాక్సిస్ బ్యాంక్