How to Get QR Code Pan Card :ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధునికీకరించిన విషయం తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా పాన్ 2.0 ప్రాజెక్ట్‌నుప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పాన్ కార్డులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో ఉంటాయి. అయితే, ప్రస్తుత పాన్ కార్డుదారులు వీటిని ఎలా పొందాలి ? ఏ విధంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవాలి ? అనేది ఈ స్టోరీలో చూద్దాం.
ఆన్‌లైన్‌లో చిరునామాను అప్‌డేట్ చేయడంతో క్యూఆర్ కోడ్ కలిగిన పాన్‌కార్డును పొందొచ్చు. ఆదాయపు పన్ను విభాగంతో నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను పాన్ కార్డుదారులు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది. అయితే, ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ విభాగం రికార్డుల్లో చిరునామాను అప్‌డేట్ చేయగానే.. క్యూఆర్ కోడ్ కలిగిన ఇ-పాన్‌ను పన్ను చెల్లింపుదారు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడీకి పంపుతారు. రూ.50 ఫీజు పేమెంట్ చేసి పాన్‌కార్డును ప్రింట్ చేసుకోవచ్చు.
సాధారణంగా పాన్‌కార్డుపై అడ్రస్ ఉండదు. దీంతో ఎక్కువ మంది చిరునామాలను అప్‌డేట్ చేయకుండా వదిలేస్తున్నారు. పాన్‌కార్డుపై అడ్రస్ లేనప్పటికీ.. ఆదాయపు పన్ను రికార్డుల్లో ప్రస్తుత అడ్రస్‌ను ఇవ్వాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఆర్థిక సంస్థలు, పన్ను వర్గాలతో సంప్రదింపులు చేయడానికి సరైన అడ్రస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో పొందడానికి, అలాగే పాన్‌తో తాజా అడ్రస్‌ను అప్‌డేట్ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో చిరునామా ఇలా మార్చుకోండి..
ఆదాయపు పన్ను విభాగం ప్రకారం.. పాన్‌కార్డుదారులు తమ అడ్రస్‌ను ఫ్రీగా మార్పు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రికార్డుల్లో చిరునామాను అప్‌డేట్ చేసేందుకు.. ఆధార్ కార్డు నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్‌తో పాన్ కార్డును లింక్ చేసుకున్న వారు, ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆధార్ ప్రకారం పాన్ డేటాబేస్‌లో అడ్రస్‌ను మార్చుకోవచ్చు.
ఈ లింకుల ద్వారా పాన్‌కార్డుదారులు తమ చిరునామాను అప్‌డేట్ చేసుకోమని పన్ను విభాగం చెబుతోంది.
1) ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL) జారీ చేసిన పాన్ కలిగిన వారు