How To Clean Your Car Interiors At Home :లక్షలు ఖర్చు చేసి కొన్న కార్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వాటికి ఉండే లుక్ పోతుంది. అది ఎక్స్టర్నల్ లుక్ కానివ్వండి, ఇంటర్నల్ లుక్ అవ్వనివ్వండి. ఇదిలా ఉంటే చాలామంది కారు ఇంటీరియర్ను క్లీన్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. దానిని ఎలా క్లీన్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సులువైన చిట్కాలను పాటించడం ద్వారా మన కారు ఇంటీరియర్ను మనమే ఇంటి వద్ద చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటంటే.
చెత్తను తొలగించండి
మనం కొన్నిసార్లు తినుబండారాలు, టిష్యూ పేపర్లు సహా ఇతరత్రాచెత్తను కారులోనే వదిలేస్తుంటాం. అటువంటి వ్యర్థాలు ఏమీ లేకుండా మీ కారును శుభ్రంగా ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీ వాహనం ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంటుంది. అంతేకాకుండా వాక్యూమ్ క్లీనర్ లాంటి పరికరాలతో కూడా మీ కారును శుభ్రంగా ఉంచుకోవచ్చు.
ఫ్యాబ్రిక్ క్లీనర్స్‌ను వాడండి
కార్లను శుభ్రపరచటానికి మార్కెట్లో ప్రత్యేకంగా కొన్ని ఫ్యాబ్రిక్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. మీ వాహనాన్ని క్లీన్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాటిని వాడండి. అదే విధంగా కారును తుడిచేటప్పుడు శుభ్రమైన క్లాత్‌ను మాత్రమే వినియోగించండి.
లెదర్ క్లీనింగ్
కారు లోపలి లెదర్లేదా వినైల్ మెటీరియల్‌ను శుభ్రపరిచేందుకు తేలికపాటి సోప్ లిక్విడ్ లేదా లెదర్ క్లీనర్‌ను వాడండి. లెదర్‌ను తుడిచేందుకు ప్రత్యేకంగా కొన్ని క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని సాఫ్ట్ క్లాత్‌కు అప్లై చేసిలెదర్ సర్ఫేస్‌లను సున్నితంగా తుడవండి. ఆ తర్వాత తుడిచిన భాగాన్ని పొడి గుడ్డతో మరోసారి క్లీన్ చేయండి. ఇలా చేస్తే ఏదైనా తేమ ఉంటే కూడా ఆరిపోతుంది. అయితే లెదర్ వస్తువులను క్లీన్ చేసేటప్పుడునీటిని ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. లేదంటే అది మీ కారు లెదర్ ఇంటీరియర్ను డ్యామేజ్ చేస్తుంది.