How To Change Name On UAN : మీరు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) చందాదారులా? మీ పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్-యూఏఎన్ పేరు తప్పుగా పడిందా? ఇలాంటి వివరాలను సులభంగా మార్చుకొనే సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. అంతేకాకుండా కొత్త మార్పులకు అవసరమయ్యే డాక్యుమెంట్లను జాబితాను కూడా పొందుపర్చింది. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది. యూఏఎన్‌లో పేరుతో పాటు తదితర మార్పులకు కనీసం మూడు డాక్యుమెంట్లు కచ్చింతగా ఉండాలని తెలిపింది. అందులో ఆధార్ కార్డు తప్పనిసరి పేర్కొంది.
EPFO UAN పేరు తప్పుగా పడిందా? నో ప్రాబ్లమ్- ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే సింపుల్‌గా ఛేంజ్ చేయొచ్చు! - HOW TO CHANGE NAME ON UAN
ఉద్యోగులు భవిష్య నిధి సంస్థ-EPFO యూఏఎన్ పేరు తప్పుగా పడిందా? పేరు మార్చాలా? అయితే మీ వద్ద ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే!
How To Change Name On UAN (ETV Bharat)
Published : Jan 3, 2025, 1:09 PM IST
యూఏఎన్‌పై పేరు మార్పు రెండు అక్షరాల కన్నా ఎక్కువ ఉన్నా, రెండు అక్షరాల కన్నా తక్కువ ఉన్నా, ఫొనెటికల్గా పేరు మార్చడానికి ఈ కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
యూఏఎన్‌పై పేరు మార్పునకు కావాల్సిన డాక్యుమెంట్లు
- ఆధార్ (తప్పనిసరి)
- పాస్‌పోర్ట్
- మరణ ధృవీకరణ పత్రం
- జనన ధృవీకరణ పత్రం
- డ్రైవింగ్ లైసెన్స్
- కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర పాలిత ప్రాంతం/PSU/బ్యాంకులు జారీ చేసిన సర్వీస్ ఫొటో గుర్తింపు కార్డు
- బ్యాంక్ అధికారి పేరు, ఫొటోపై క్రాస్ స్టాంప్ చేసిన బ్యాంక్ పాస్ బుక్
- పాన్ కార్డ్/ఇ-పాన్
- రేషన్/PDS ఫొటో కార్డ్
- ఓటరు గుర్తింపు కార్డు/ఇ-ఓటర్ గుర్తింపు కార్డు
- పెన్షనర్ ఫొటో కార్డ్/ఫ్రీడం ఫైటర్ ఫొటో కార్డ్
- రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు/PSU/రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (RSBY) కార్డ్ జారీ చేసిన ఫొటోతో కూడిన CGHS/ECHS/మెడి-క్లెయిమ్ కార్డ్
- ఫొటోతో కూడిన ST/SC/OBC సర్టిఫికెట్
- పూర్తి పేరు/మొదటి పేరు మార్పు అభ్యర్థనల కోసం: PF సభ్యుడు కొత్త పేరు గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరుతో ఉన్న ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్‌ను ఫొటోతో పాటు సమర్పించాలి.
- ఇతర విదేశీ జాతీయుల విషయంలో, విదేశీ పాస్‌పోర్ట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే వీసా
- ఫొటో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కార్డ్
- భారత ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్ (PIO) కార్డ్ కాపీ
- భారత ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (OCI)కార్డ్, 19. టిబెటన్ శరణార్థి కార్డ్ కాపీలు