How To Avoid Tyre Burst :మనలో చాలా మంది కొత్త కారు కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ బాగానే చేస్తారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత కనీసం వెహికిల్ కండీషన్‌లో ఉందా లేదా అని కూడా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేస్తారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే.. అలర్ట్‌గా ఉండాల్సిందే అంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు. ఎందుకంటే రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో.. రహదారులపై స్పీడ్‌గా ప్రయాణించేటప్పుడు కారు టైర్లు ఒత్తిడికిగురై పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అసలు టైర్లు ఎందుకు పేలుతాయి? టైర్ పేలినప్పుడు కారును ఏ విధంగా కంట్రోల్ చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారు టైర్లు పేలడానికి కారణాలు :
- కారు టైర్లలో గాలి తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా కూడా పేలిపోయే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. అందుకే యూజర్ మాన్యువల్ బుక్‌లో సూచించిన విధంగా టైర్లలో గాలి నింపాలి.
- అలాగే ఎండకాలంలో రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టైర్లు వేడెక్కుతాయి. ఇలా టైర్లలో పీడనం ఎక్కువైతే కూడా పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- హై స్పీడ్‌గా డ్రైవింగ్ చేయడం వల్ల కూడా టైర్లు పేలుతాయి.
- రోడ్డుపై గుంతులు ఉండటం వల్ల కూడా టైర్లు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
- అలాగే టైర్లు పాతగా మారిపోయినవి వాడటం వల్ల కూడా పేలిపోయే ప్రమాదం ఉందట.
మీ కారు మంచి ధరకు అమ్ముడుపోవాలంటే - ఇలా చేయండి!
టైర్ పేలితే ఇలా చేయండి :
- కారు టైర్ పేలినప్పుడు ఆందోళన చెందకండి. భయపడకుండా ప్రశాంతంగా ఉండేలా మైండ్‌ను సెట్ చేసుకోండి.
- కార్ టైర్ పేలితే అది ఒకే వైపు స్టీరింగ్ తిరిగేలా చేస్తుంది. కాబట్టి, రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీ కొట్టకుండా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోండి.
- కారు వేగాన్ని మెల్లిగా తగ్గిస్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కన నిలపండి.
- అలాగే వెనక నుంచి వస్తున్న వాహనాలకు సిగ్నల్‌గా హజర్డ్ లైట్‌ను ఆన్ చేయండి.
- సడన్‌గా బ్రేక్ వేయవద్దని గుర్తుంచుకోండి.