Gold Rate Today August 2nd, 2024 :దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.71,890 ఉండగా, శుక్రవారం నాటికి రూ.443 పెరిగి రూ.72,333కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.85,990 ఉండగా, శుక్రవారం నాటికి రూ.416 తగ్గి రూ.85,574కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 2nd, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
- Gold Price In Vijayawada August 2nd, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 2nd, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
- Gold Price In Proddatur August 2nd, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.72,333గా ఉంది. కిలో వెండి ధర రూ.85,574గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 2nd, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2445 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 9 డాలర్లు పెరిగి 2454 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.79 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 2nd, 2024 :శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.49,44,000 |
ఇథీరియం | రూ.2,35,000 |
టెథర్ | రూ.76.59 |
బైనాన్స్ కాయిన్ | రూ.41,397 |
సొలోనా | రూ.11,900 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today August 2nd, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత కొన్ని సెషన్లలో వచ్చిన లాభాలను మదుపరులు బుక్ చేసుకుంటున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తున్నాయి. దీనితో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.