Electric Scooters Under 1 Lakh : ప్రస్తుత కాలంలో దేశంలో స్కూటర్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా నడపగలగడమే ఇందుకు కారణం. పైగా హెవీ ట్రాఫిక్‌లోనూ, చిన్న చిన్న సందుల్లోనూ చాలా ఈజీగా స్కూటీతో వెళ్లిపోవచ్చు. అందుకే చాలా మంది స్కూటీలు కొనడానికి ఇష్టపడతారు. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 ఈవీ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.
1. Ola S1 X :ఓలా ఎస్1 ఎక్స్ ఈవీ స్కూటర్ నాలుగు వేరియంట్లు, 7 కలర్స్‌లో అందుబాటులో ఉంది. బడ్జెట్లో స్కూటీ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
- రేంజ్- 95 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- కెర్బ్ వెయిట్- 101 కేజీలు
- ఛార్జింగ్ టైమ్- 5గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 2 Kwh
- టాప్ స్పీడ్- 85 కి.మీ/గంటకు
- బ్యాటరీ వారెంటీ- 8 సంవత్సరాలు
- ధర-రూ.73,714 -రూ. 99,160
2. Hero Electric Optima : హీరో ఎలక్ట్రిక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్ ఫంక్షన్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటీ 2 వేరియంట్లు, రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది.
- రేంజ్- 89 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- కెర్బ్ వెయిట్- 93 కేజీలు
- ఛార్జింగ్ టైమ్- 4.5గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 2 Kwh
- టాప్ స్పీడ్- 48 కి.మీ/గంటకు
- బ్యాటరీ వారెంటీ- 4 సంవత్సరాలు
- ధర-రూ.83,300 - రూ.1.04 లక్షలు
3. Ampere Magnus EX :అంపైర్ మాగ్నస్ ఈఎక్స్ ఒక వేరియంట్, 5 కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇది మంచి లుక్‌లో ఉంటుంది. హాలోజన్ హెడ్‌లైట్, టెయిల్ లైట్, ఎల్ సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఈ ఈవీలో ఉంటాయి.
- రేంజ్- 121 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- కెర్బ్ వెయిట్- 82 కేజీలు
- ఛార్జింగ్ టైమ్- 6-7గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 2.29 Kwh
- టాప్ స్పీడ్- 50 కి.మీ/గంటకు
- మోటార్ పవర్-2.1 kW
- బ్యాటరీ వారెంటీ- 3 ఏళ్లు లేదా 30వేల కి.మీ
- ధర-రూ.79,900
4. Zelio Gracy i :ఈ ఈవీ స్కూటీ 3 వేరియంట్లు, ఏడు కలర్స్‌లో లభిస్తోంది. మంచి స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. బడ్జెట్లో ఈవీ స్కూటీ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది.
- రేంజ్- 60-120 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- కెర్బ్ వెయిట్- 118 కేజీలు
- ఛార్జింగ్ టైమ్- 6-8గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 1.34 Kwh
- ధర-రూ.56,825 - రూ.82,273
5. Okinawa PraisePro :ఈ మోడల్ ఈవీ స్కూటీ ఒక వేరియంట్, మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటీలో యాంటీ-తెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఆపరేషన్, యూఎస్బీ పోర్ట్, వాకింగ్ అసిస్టెన్స్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
- రేంజ్- 81 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- ఛార్జింగ్ టైమ్- 2-3గంటలు
- బ్యాటరీ కెపాసిటీ- 2.08 Kwh
- టాప్ స్పీడ్- 56 కి.మీ/గంటకు
- మోటార్ పవర్-1 kW
- బ్యాటరీ వారెంటీ- 3 సంవత్సరాలు
- ధర-రూ.84,443