Electric Bike Maintenance Tips :ప్రస్తుత కాలంలో ఎలక్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పర్యావరణ ప్రేమికులు వీటిని ఎక్కువగా కొంటున్నారు. వీరితోపాటు పెరిగిన ఇంధన ధరలను తట్టుకోలేక, చాలామంది ఈవీ బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈవీ టూ-వీలర్స్‌ను ఎలా మెయింటైన్ చేయాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. దీనికి తోడు మన దేశంలో ఈవీ టూ-వీలర్స్ రిపేర్ షాపులు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో మీ ఈవీ బైక్ మెయింటెనెన్స్ కోసం పనికి వచ్చే టాప్-7 టిప్స్ గురించి తెలుసుకుందాం.
1. బైక్‌ను తరచుగా క్లీన్ చేస్తుండాలి!
మీ ఎలక్ట్రిక్ బైక్‌ను కనీసం వారానికి ఒకసారి అయినా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఇంజిన్, చైన్ల్లోని దుమ్ము, ధూళిని తొలగించాలి. అప్పుడే బైక్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒకవేళ ఇంజిన్‌లో దుమ్ము, ధూళి చేరితే ఇంజిన్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.
2. ఓవర్ లోడ్ వేయకూడదు!
మీ ఈవీ బైక్ ఎంత బరువు వరకు మోయగలదో, అంతే వెయిట్‌తో ప్రయాణించాలి. దానిపై ఎక్కువ మంది వెళ్లటం లేదా అధిక బరువు ఉండే వస్తువులను తీసుకెళ్లడం లాంటివి చేయకూడదు. ఏవో కొన్ని సందర్భాల్లో అయితే ఫర్వాలేదు కానీ, తరచూ ఈవీ బైక్‌ల అధిక బరువులతో ప్రయాణం చేస్తే ఇంజన్‌పై, టైర్లపై చాలా దుష్ప్రభావం పడుతుంది.
3. పవర్ ఆఫ్ చేయాలి!
సాధారణంగా మనం ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు లేదా ఎక్కడైనా ఆగినప్పుడు బైక్ ఇంజన్ ఆఫ్ చేయకుండా ఉంచుతాం. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. మీరు ఎక్కడైనా ఈవీ బైక్‌ను ఆపినప్పుడు, తప్పకుండా ఇంజన్ ఆఫ్ చేయాలి. దాని వల్ల పవర్ ఆదా అవడంతో పాటు, మీ స్కూటీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
4. తరచుగా టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి!
సాధారణంగా ఈవీ బైక్‌లు లైట్ వెయిట్ కలిగి ఉంటాయి. కనుక టైర్లో ఎంత ప్రెజర్ ఉందో మనకు తెలియదు. కానీ మనం టైర్ ప్రెజర్ గురించి పట్టించుకోకుండా దీర్ఘకాలంపాటు ప్రయాణాలు చేస్తుంటే, ఇంజిన్‌పై దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనుక టైర్ ప్రెజర్‌ను తరచుగా చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం టైర్ ప్రెజర్ చెక్ చేసుకునే పరికరాలు, మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.