తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏసీ ఆన్​ చేసి కారు నడిపితే - మైలేజ్ తగ్గుతుందా? - Does AC Usage Reduce Car Mileage

Does AC Affect Car Mileage : కారు ఎక్కారంటే.. చాలా మందికి ఏసీ ఆన్​లో ఉండాల్సిందే. అయితే.. ఏసీ ఆన్​చేసి కారు డ్రైవ్ చేస్తే.. మైలేజ్ తగ్గుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి, ఇందులో నిజమెంత? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.

AC
Car Mileage

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:21 AM IST

AC Usage Affect Car Mileage? :కారు రన్నింగ్​లో ఉన్నప్పుడు.. ఏసీ ఆన్​ చేస్తే మైలేజ్​పై ప్రభావం పడుతుందని కొందరు భావిస్తుంటారు. మరి.. అది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఎంత మైలేజ్ తగ్గుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కారు ఏసీ ఎలా పని చేస్తుందంటే?

కారులో ఏసీ ఆన్​లో ఉన్నప్పుడు అది ఆల్టర్నేటర్​ నుంచి పొందిన పవర్​ను యూజ్ చేసుకుంటుంది. ఈ పవర్ అనేది వెహికల్ ఇంజిన్ ద్వారా అందుతుంది. అప్పుడు ఏసీ సిస్టమ్​లోని కండెన్సర్, కంప్రెసర్, ఎక్స్‌పాండర్, ఎవాపరేటర్ అన్నీ సంయుక్తంగా పనిచేసి.. కారు క్యాబిన్​లోకి చల్లని గాలిని రిలీజ్ చేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. కారు స్టార్ట్ అయ్యే వరకు ఏసీ కూడా ఆన్​ కాదు. ఎందుకంటే ఏసీ కంప్రెసర్​కు యాడ్ చేసిన బెల్ట్ వెహికల్.. ఇంజిన్ ఆన్​లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. ఇలా ఏసీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ఏసీ వాడకం మైలేజీని తగ్గిస్తుందా?

సాధారణంగా ఇంజిన్ ఉత్పత్తి చేసే పవర్‌.. కారు నడవడానికి మాత్రమే కాకుండా ఏసీ సిస్టమ్​ రన్​ అవ్వడానికి కూడా కొంతమేర సప్లై అవుతుంది. కాబట్టి, ఇంజిన్ మండించే ఫ్యూయల్​లో కొంతమేర ఏసీ కోసం ఖర్చవుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న ఆధునిక కార్లలో ఏసీ కోసం ఖర్చయ్యే ఇంధనం చాలా తక్కువేనని ఆటో మొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ.. తక్కువ పవర్ ఉత్పత్తి చేసే ఇంజిన్​ ఉన్న పాత కార్లలో నిరంతరం ఏసీని యూజ్ చేస్తే మాత్రం సుమారుగా 20 శాతం వరకు మైలేజ్ తగ్గిపోతుందని అంటున్నారు.

కారులో ఏసీ ఆన్​చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు అది చాలా రకాలుగా వెహికల్ మైలేజ్​​పై ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా తక్కువ పవర్ జనరేట్ చేసే కార్లు కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తుంటే.. మైలేజ్ ఇంకా దారుణంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఆ సమయంలో ఇంజిన్ మీద ఎక్కువ భారం పడుతుంది. అప్పుడు ఏసీ ఆన్​లో ఉంటే ఇంధన వినియోగం విపరీతంగా పెరిగి మైలేజ్ మరి దారుణంగా తగ్గుతుందంటున్నారు.

షాకింగ్ : కారు సీటుతో సంతాన సామర్థ్యానికి దెబ్బ - పిల్లలు పుట్టరా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేటితరకం కొత్త కార్లలో ఏసీ సిస్టమ్ పనిచేయడానికి చాలా తక్కువ ఫ్యూయల్ మాత్రమే ఖర్చవుతుంది. ఇంజిన్ జనరేట్ చేసే పవర్ ఆధారంగానే ఏసీ నడుస్తుంది కాబట్టి.. పెద్దగా నష్టం లేదంటున్నారు. కాబట్టి ఎలాంటి సందేహమూ లేకుండా కారులో ఏసీ ఆన్​ చేసుకొని వెహికల్ డ్రైవ్ చేయండని సూచిస్తున్నారు.

మైలేజ్‌ను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు :

  • మీరు కారు నడుపుతున్నప్పుడు ఏసీ అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే వాడటం మేలు అంటున్నారు నిపుణులు.
  • అలాగే వీలైనంతవరకూ కారు విండో డోర్లను ఓపెన్ చేయడం ద్వారా వచ్చే గాలితో ఎడ్జస్ట్ అవ్వడం ఉత్తమం.
  • అదేవిధంగా.. కారు టైర్లలో ప్రెషర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
  • వెహికల్​లో అనవసరమైన వస్తువుల్ని తొలగించాలి. దీనివల్ల బరువు తగ్గి మైలేజ్ కలిసి వస్తుంది.
  • మరీ ముఖ్యంగా.. కారును స్థిరమైన వేగంతో నడిపడం అవసరం. దీనివల్ల ఫ్యూయల్ వాడకం తగ్గుతుందని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు.

మీ కారు ఇచ్చే ఈ సిగ్నల్స్‌ చూస్తున్నారా? - లేకపోతే ఇంజిన్‌ ఖతం!

ABOUT THE AUTHOR

...view details