Crazy Concept Bike : మనం సాధారణంగా మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు కొనాలని అనుకుంటాం. కుర్రకారు అయితే మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ మీరు కాన్సెప్ట్ బైక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? వీటినే కొందరు షో బైక్స్ అని, ఫ్యూచర్ బైక్స్ అని కూడా అంటారు. మరి ఈ క్రేజీ బైక్స్ గురించి మనమూ తెలుసుకుందామా?
1. Suzuki Falcorustyco
1985 టోక్యో మోటార్ షోలో మొదటిసారిగా 'సుజుకి ఫాల్కోరస్టీకో' బైక్‌ను ప్రదర్శించారు. ఆధునిక యుగంలో బాగా గుర్తుండిపోయే, మొదటి కాన్సెప్ట్ బైక్ ఇదే అని చెప్పుకోవచ్చు. స్క్వేర్-ఫోర్ ఫోర్-స్ట్రోక్, త్రీ క్యామ్స్, హైడ్రాలిక్ డ్రైవ్, సెంటర్ స్ట్రీరింగ్తో దీనిని డిజైన్ చేశారు.
2. Suzuki GSX1000 Katana
సుజుకి కంపెనీ 1982లో 'జీఎస్ఎక్స్ 1000 కతానా' బైక్‌ను లాంఛ్ చేసింది. హై-స్పీడ్ స్టెబిలిటీ, ఏరోడైనమిక్స్ ఫీచర్స్‌తో దీనిని మాజీ బీఎండబ్ల్యూ చీఫ్ డిజైనర్ హన్స్ ముత్ రూపొందించారు. సుజుకి కంపెనీ తెచ్చిన బెస్ట్ కాన్సెప్ట్ కారు ఇదే అని చెప్పవచ్చు.
3. Suzuki Nuda
సుజుకి కంపెనీ 1986 టోక్యో షోలో 'న్యూడా' బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌లో GSX-R750 బైక్‌లో వాడిన ఇంజిన్నే వాడారు. సుజుకి టోటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్‌తో, టూ-వీల్ షాఫ్ట్ డ్రైవ్, హబ్-సెంటర్ స్టీరింగ్‌తో దీనిని రూపొందించారు.
4. Harley-Davidson Café Racer Concept
హార్లే-డేవిడ్సన్ కేఫే రేసర్ కాన్సెప్ట్ బైక్‌ను 85 కొలోన్ షోలో ప్రదర్శించారు. మంచి స్పోర్ట్‌స్టర్ కాన్సెప్ట్ బైక్ ఇది. అప్పటి కాలంతో పోలిస్తే, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టూ-వీలర్ అని చెప్పుకోవచ్చు.