Upcoming Cars In 2024 : భారతదేశంలో కార్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ, తమ లేటెస్ట్ కార్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
జనవరి నెలలో ఏకంగా 18 న్యూ ఎడిషన్ కార్లు భారత్‌లో లాంఛ్ అయ్యాయి. వీటికి విశేష ఆదరణ కూడా లభించింది. ఈ ఫిబ్రవరి నెలలో కూడా టాటా, మారుతి, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, లెక్సస్ లాంటి టాప్ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
1. Tata Tiago, Tigor AMT CNG : టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్ కార్ల టీజర్లను విడుదల చేసింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వస్తున్న ఫస్ట్ సీఎన్జీ పవర్డ్ ఆటోమేటిక్ వేరియంట్స్ కావడం గమనార్హం. వీటిని ఈ ఫిబ్రవరి నెలలోనే లాంఛ్ చేసే అవకాశం ఉంది.
Tata Tiago Price : టాటా టియాగో ఏఎంటీ సీఎన్జీ ధర సుమారుగా రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉండవచ్చని అంచనా.
Tata Tigor Price : టాటా టిగోర్ ఏఎంటీ సీఎన్జీ ధర సుమారుగా రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చని అంచనా.
2. Mahindra XUV300 :దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఈ ఫిబ్రవరిలోనే XUV300 కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. టాటా నెక్సాన్, కియా సోనెట్‌లకు పోటీగా తెస్తున్న ఎస్యూవీ కారు ఇది. ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారులో అనేక ఫీచర్లు, స్పెక్స్ మోడిఫై చేసినట్లు సమాచారం.
Mahindra XUV300 Price : ఈ మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్ కారు ధర సుమారుగా రూ.9.31 లక్షల నుంచి రూ.13.16 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉండవచ్చని సమాచారం.
3. Hyundai Creta N Line :హ్యుందాయ్ కంపెనీ స్పోర్టీ వెర్షన్ 'క్రెటా'ను త్వరలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ థర్డ్ ఎన్ లైన్ మోడల్ కారులో అనేక ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది.
Hyundai Creta N Line Price : ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు ధర సుమారుగా రూ.20 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చని తెలుస్తోంది.
4. Maruti Swift : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి త్వరలోనే ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిని హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌కు పోటీగా తీసుకువస్తున్నట్లు సమాచారం.