Bike Shopping At Year End Sale : 2024 సంవత్సరం ముగియడానికి కేవలం 2 నెలలే ఉంది. అందుకే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ బైక్‌లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. మరి ఇలాంటి ఇయర్ ఎండ్ సేల్‌లో కొత్త బైక్ కొనవచ్చా? లేదా 2025 వరకు వెయిట్ చేయాలా? వీటిలో ఏది బెటర్ ఆప్షన్?
గ్రేట్ డీల్స్
ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ సంవత్సరాంతంలో తమ దగ్గర ఉన్న ఇన్వెంటరీలను క్లియర్ చేయాలని అనుకుంటాయి. కస్టమర్లు కూడా లేటెస్ట్ మోడల్స్ కోసం చూస్తూ ఉంటారు. అందుకే వారికి ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తుంటాయి. పైగా ఫ్రీ యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారెంటీ అందిస్తాయి. కనుక తక్కువ ధరకే మంచి బైక్ కొనాలని ఆశించేవారికి ఇయర్ ఎండ్ సేల్ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా మీరు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వరకు వేచి చూస్తే, లేటెస్ట్ మోడల్స్ లాంఛ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు ప్రస్తుత మోడల్స్ - లేటెస్ట్ ఫీచర్స్, స్పెక్స్‌తో అప్డేట్ అవుతాయి. కానీ వాటి ధర కాస్త పెరుగుతుంది.
విన్-విన్ స్ట్రాటజీ
సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ సరికొత్త బైక్‌లను లాంఛ్ చేసే ముందు, తమ పాత మోడల్స్ ధరలను బాగా పెంచుతాయి. దీనికి తయారీ ఖర్చులు, ద్రవ్యోల్బణం కూడా కారణం కావచ్చు. దీని వల్ల కస్టమర్లపై అదనపు భారం పడుతుందని వాటికి తెలుసు. ఉందుకే కస్టమర్లను ఊరించేందుకు భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఈ సమయంలో బైక్ కొంటే కస్టమర్లకు తక్కువ ధరకే కోరుకున్న బండి లభిస్తుంది. ఇలా కాకుండా కాస్త వేచి చూస్తే ఆటోమొబైల్ కంపెనీకి కొత్త సంవత్సరంలో సేల్స్ పెరుగుతాయి. దీనినే విన్-విన్ స్ట్రాటజీ అంటారు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్
చాలా మంది తమ పాత బైక్‌ను అమ్మేసి కొత్తది కొనాలని అనుకుంటారు. కానీ మార్కెట్లో దానికి తగినంత డబ్బు రాదు. ఇలాంటి వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా ఆటోమొబైల్ కంపెనీలు పాత బైక్‌ను ఎక్స్ఛేంజ్ చేసి కొత్తది తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. కనుక బయ్యర్లు నేరుగా షోరూమ్‌కు వెళ్లి తమ పాత బైక్‌ను ఇచ్చేసి కొత్తది తీసుకోవచ్చు. సాధారణంగా బైక్ విలువ ఏటా 10-12 శాతం వరకు తగ్గుతూ ఉంటుంది. దీని ప్రకారం లెక్క వేసి మీకు కొత్త బైక్ ఇస్తారు.