Best Sunroof Cars Under 10 Lakh :ఇటీవలి కాలంలో సన్‌రూఫ్ ఉన్న కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉండేది. కానీ నేడు అఫర్డబుల్ కార్లలోనూ సన్‌రూఫ్ ఉంటోంది. మరి మీరు కూడా మంచి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్న కారు కొనాలని ఆశిస్తున్నారా? అయితే మరెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్‌లో రూ.10 లక్షల బడ్జెట్లోపు లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం రండి.
1. Tata Nexon : టాటా నెక్సాన్ అనేది ఒక సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ. దీని ప్రారంభ ధర రూ.8.15 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంటుంది. దీనిలో వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంటుంది. అలాగే దీనిలో 6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కారులోపల 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారులో ఆటో హెడ్ల్యాప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. ఈ టాటా నెక్సాన్ కారుకు గ్లోబల్ ఎన్సీఏపీ 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. కనుక సేఫ్టీ పరంగా చూస్తే, ఇది నంబర్ 1 కారు అని చెప్పుకోవచ్చు.
2. Hyundai Exter : ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ అనేది ఒక ఎంట్రీ లెవల్ ఎస్యూవీ. దీని ఎక్స్-షోరూం ధర రూ.6 లక్షల నుంచి రూ.10.15 లక్షల వరకు ఉంటుంది. దీనిలో వాయిస్-ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. ఇంకా ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్, వైర్లెస్ ఛార్జింగ్, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఈ హ్యుందాయ్ కారు 19.2 kmpl నుంచి 27.1 kmpl మైలేజ్ ఇస్తుంది.
3. Tata Punch :ఇండియాలోని టాప్-సెల్లింగ్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇది మంచి స్పోర్టీ డైనమిక్స్‌తో, టచ్ యుటిలిటీతో వస్తుంది. మార్కెట్లో ఈ టాటా పంచ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్-షోరూం) ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఈ టాటా పంచ్ కారులో వాయిస్-అసిస్టెడ్ సన్‌రూఫ్ ఉంది. ఈ ఎస్యూవీ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ కారులో 7-అంగుళాల సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. టాటా పంచ్ కారులో రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. మైలేజ్ విషయానికి వస్తే, టాటా పంచ్ 18.8 kmpl నుంచి 26.99 kmpl మైలేజ్ ఇస్తుంది.