తెలంగాణ

telangana

ETV Bharat / business

స్మాల్​ క్యాప్​ మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయాలా? టాప్-10 ఆప్షన్స్​ ఇవే! - Best Small Cap Mutual Funds

Best Small Cap Mutual Funds In 2024 : స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. గత మూడేళ్లుగా ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందిస్తున్న టాప్-10 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

best Mutual funds in 2024
best small cap Mutual funds (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:25 PM IST

Best Small Cap Mutual Funds In 2024 : స్టాక్ మార్కెట్​లో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. కారణం అక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండటమే. అందుకే మ్యూచువల్ ఫండ్లు దీనికి మంచి ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లపై సరైన అవగాహన ఉంటే, ఈ స్మాల్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు మన దగ్గర నిధులు సేకరించి వేర్వేరు పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మదుపరులకు లాభాలు పంచిపెడుతుంటాయి. అందుకే గత మూడేళ్లలో పెట్టుబడిదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవి? ప్రస్తుతానికి ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయడం మంచిది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) వెబ్​సైట్‌ డేటా ప్రకారం, గత మూడేళ్లుగా క్యాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లాభాల బాటలో దూసుకెళ్తోంది. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ పెట్టుబడిదారులకు 42.34 శాతం రాబడిని అందించింది. అలాగే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 36 శాతం, హెచ్​ఎస్​బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ 33.73 శాతం, హెచ్​డీబీసీ స్మాల్ క్యాప్ ఫండ్ 31.91 శాతం రాబడిని పెట్టుబడిదారులకు అందజేశాయి. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్​ ఫండ్, టాటా స్మాల్ క్యాప్ ఫండ్ , బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ వంటివి కూడా 30శాతానికి పైగా రాబడిని తెచ్చిపెట్టాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్‌ క్యాప్ ఫండ్ 29.99శాతం లాభాన్ని ఇచ్చింది. కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా స్మాల్‌ క్యాప్ ఫండ్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.

గత మూడేళ్లలో అత్యుత్తమ రాబడిని అందించిన టాప్-10 స్మాల్ క్యాప్ ఫండ్స్

  • క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 42.34 శాతం
  • నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 36 శాతం
  • హెచ్​ఎస్​బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 33.73శాతం
  • హెచ్​డీఎఫ్​సీ స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 31.91శాతం
  • ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్​ కంపెనీస్​ ఫండ్ (డైరెక్ట్​) - 31.30 శాతం
  • టాటా స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 31.25 శాతం
  • బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్​ (డైరెక్ట్​) - 30.91 శాతం
  • కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 30.80 శాతం
  • ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 30-35 శాతం
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్‌ క్యాప్ ఫండ్ (డైరెక్ట్​) - 29.99 శాతం

ఆర్థిక నిపుణులను సంప్రదించాల్సిందే!
ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గతంలో మంచి రాబడిని ఇచ్చినప్పటికీ, భవిష్యత్తులో కూడా అంతే సానుకూల ఫలితాలు అందిస్తాయని చెప్పలేము. అయినప్పటికీ వీటి ట్రాక్ రికార్డు ఆధారంగా పెట్టుబడులు పెట్టేందుకు ఒక అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మ్యూచువల్​ ఫండ్స్ వంటి రిస్కీ పెట్టుబడులు పెట్టే ముందు, క్షుణ్ణంగా అన్నీ విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది. అలాగే మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను కచ్చితంగా సంప్రదించాలి.

2024 జూన్​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In June 2024

నో స్కిడ్డింగ్, టైర్లకు ఫుల్ గ్రిప్- ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్​తో టాప్​-5 కార్స్ ఇవే- బడ్జెట్ రూ.10లక్షలే! - Cars With Traction Control

ABOUT THE AUTHOR

...view details