Best Personal Loan Interest Rates Offering Banks 2024 :అనుకోని ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు చాలామంది వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్) వైపు చూస్తుంటారు. వైద్య ఖర్చులు, విహార యాత్రలు, చిన్న రుణాలను తీర్చడానికి ఇలా పలు సందర్భాల్లో ఈ లోన్లను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తక్షణ అవసరాలను తీర్చుకునేందుకు ఇవి ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే రుణ గ్రహీతపై మరింత భారం పడుతుంది. అందుకే పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. పర్సనల్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు తీసుకునే బ్యాంకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకునే విషయాలు!
వడ్డీ రేట్లను సరిపోల్చండి
వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు వివిధ బ్యాంకులను బట్టి మారుతుంటాయి. అలా పర్సనల్ లోన్లను అందించే ఆర్థిక సంస్థలు తీసుకునే వడ్డీ రేట్లను సరిపోల్చండి. తక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఈఎంఐలు, పూర్తి రూణాన్ని తిరిగి చెల్లించడం సులభమవుతుంది.
అవసరాలను అంచనా వేసుకోండి
వ్యక్తిగత రుణాలను విభిన్న ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మీ ఆర్థిక అవసరాలను స్పష్టంగా అంచనా వేసుకోండి. మీ అవసరానికి వ్యక్తిగత రుణమే బెస్ట్ సొల్యూషన్ అని నిర్దరించుకోండి.
క్రెడిట్ హిస్టరీని చెక్ చేసుకోండి
త్వరగా లోన్ అప్రూవ్ కావాలంటే మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. మన క్రెడిట్ హిస్టరీ ఆధారంగానే ఆర్థిక సంస్థలు రుణ అర్హతను నిర్ణయిస్తాయి.
సామర్థ్యాన్ని అంచనా వేయండి
పర్సనల్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి. ఇబ్బందులు లేకుండా నెలవారీ చెల్లింపులను నిర్వహించడానికి మీకు తగినంత ఆదాయం సమకూరుతుందో లేదో నిర్ధరించుకోండి.
వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు