Best Mileage Bikes Under 90000 :మీ దైనందిన అవసరాల కోసం మంచి బైక్ కొనాలని అనుకుంటున్నారా? ఇందుకోసం తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-10 బైక్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
10. Honda Shine : ఇండియాలోని మోస్ట్ పాపులర్ బైక్స్‌లో హోండా షైన్ ఒకటి. ఇది 2 వేరియంట్లలో, 5 కలర్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. తక్కువ ధరలో మంచి బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో దీనికి పోటీగా హోండా ఎస్పీ 125, హోండా సీడీ 110 డ్రీమ్ ఉన్నాయి.
- ఇంజిన్ - 123.94 సీసీ
- పవర్ - 10.59 bhp
- టార్క్ - 11 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 55 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
Honda Shine Price : మార్కెట్లో ఈ హోండా షైన్ బైక్ ధర రూ.82,065 - రూ.86,067 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
9. TVS Raider 125 :టీవీఎస్ రైడర్ 125 బైక్ 6 వేరియంట్లలో, 12 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్ 125, హోండా ఎస్పీ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125 ఉన్నాయి.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 11.2 bhp
- టార్క్ - 11.2 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 56.7 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 123 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
TVS Raider 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ ధర సుమారుగా రూ.89,366 - రూ.1,08,213 వరకు ఉంటుంది.
8. Honda Livo :హోండా లివో 2 వేరియంట్లలో, 3 కలర్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగాల్లో డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి కాంపిటీషన్‌గా టీవీఎస్ విక్టర్ ఉంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 8.67 bhp
- టార్క్ - 9.30 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 113 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9 లీటర్లు
Honda Livo Price : మార్కెట్లో ఈ హోండా లివో బైక్ ధర సుమారుగా రూ.80,053 - రూ.84,053 వరకు ఉంటుంది.
7. Hero Splendor Plus : తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకునేవారికి హీరో స్ల్పెండర్ ప్లస్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా హోండా షైన్ 100, టీవీఎస్ రేడియన్ ఉన్నాయి.
- ఇంజిన్ - 97.2 సీసీ
- పవర్ - 7.91 bhp
- టార్క్ - 8.05 Nm
- ట్రాన్స్మిషన్ - 4 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
Hero Splendor Plus Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర సుమారుగా రూ.74,650 - రూ.78,560 వరకు ఉంటుంది.
6. Hero Xtreme 125R : ప్రతి రోజూ బండి నడిపేవారికి హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇది రెండు వేరియంట్లలో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. మార్కెట్లో దీనికి పోటీగా టీవీఎస్ రైడర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 ఉంటుంది.
- ఇంజిన్ - 124.7 సీసీ
- పవర్ - 11.4 bhp
- టార్క్ - 10.5 Nm
- ట్రాన్స్మిషన్ - 5 స్పీడ్ మాన్యువల్
- మైలేజ్ - 66 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర సుమారుగా రూ.97,683 - రూ.1,03,328 వరకు ఉంటుంది.