Best Cruise Control Cars In India : పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ ఒక కార్ ఉంటే బాగుండేదని అనిపిస్తోంది. కానీ చాలా మందికి ఇదొక కలే. కారును కొనుగోలు చేయాలంటే బడ్జెట్‌తో పాటు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఫీచర్లు గమనించి తీసుకోవాలి. అందులో క్రూయిజ్ కంట్రోల్ కూడా ఒకటి. అసలీ క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? రూ. 10 లక్షల లోపు ఉన్న మంచి క్రూయిజ్ కంట్రోల్ కార్ల గురించి తెలుసుకుందాం.
క్రూయిజ్ కంట్రోల్ అనేది ప్రస్తుతం వస్తున్న కార్లలో ఒక అద్భుతమైన ఫీచర్. సింగిల్ బటన్‌తో మన కారును ఒక నిర్దిష్ట వేగంతో నడిపే ఒక వ్యవస్థ. వాహనాన్ని పరుగులెత్తించాలంటే యాక్సలరేటర్ తొక్కాలి. కానీ దాని మీద అదే పనిగా కాలు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి బాధను తగ్గించడానికే ఈ ఫీచర్ తీసుకొచ్చారు. స్టీరింగ్ పక్కనే ఉండే ఈ కంట్రోల్ బటన్‌ను నొక్కితే ఒక నిర్దిష్టమైన వేగంతో కారు వెళుతుంది. ఇదో ఎలక్ట్రిక్ సిస్టమ్. దీన్ని ఉపయోగిస్తే డ్రైవింగ్‌లో ఉండే అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. లాంగ్ ట్రిప్‌లకు వెళ్లే వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ అందిస్తున్న ఇండియాలోని బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్- 5 కార్స్ గురించి చూద్దాం.
Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ఇండియాలో క్రూయిజ్ కంట్రోల్‌తో నడిచే కార్లలో బెస్ట్ ఆప్షన్. మార్కెట్ ధర రూ.7.28 లక్షలు. ఈ ఫీచర్లో పెట్రోల్-మాన్యువల్ ఇంజిన్‌తో ఉన్న మిడ్-స్పెక్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.
Maruti Suzuki Nexa Baleno Alpha :అతిపెద్ద వినియోగదారుల్ని కలిగిన ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతి సుజుకి.. తన బలెనో మోడల్ ఆల్ఫా వేరియంట్‌లో క్రూయిజ్ కంట్రోల్ అందిస్తుంది. ఈ ఫీచర్ ఉంటే మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు హాయిగా ఉంటుంది.ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మాన్యువల్ అయితే రూ. 9.33 లక్షలు, ఆటోమేటిక్ అయితే రూ. 9.88 లక్షలు ఉంది.