తెలంగాణ

telangana

ETV Bharat / business

డబ్బులు పంపించే ముందు అకౌంట్ వెరిఫికేషన్​ - RTGS, NEFTలో పొరపాట్లకు చెక్​ పెట్టాలా ఆర్​బీఐ ప్లాన్! - LOOK UP FACILITY IN NEFT AND RTGS

నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ చెల్లింపుల సమయంలో లబ్ధిదారుడి పేరు కనిపించేలా కొత్త సదుపాయం - NPCIకి RBI ఆదేశాలు

Look Up Facility In NEFT And RTGS
Look Up Facility In NEFT And RTGS (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 10:34 PM IST

Look Up Facility In NEFT And RTGS :RTGS, NEFT చెల్లింపుల విషయంలో పొరబాట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కొత్త సదుపాయం త్వరంలో రానుంది. ఆయా చెల్లింపుల వ్యవస్థల ద్వారా ఏ బ్యాంక్​ అకౌంట్​కు నగదు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నామో, ఆ వ్యక్తి పేరు కనిపించనుంది. ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌కు-NPCI రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- ఆర్​బీఐ సూచనలు జారీ చేసింది. 2025 ఏప్రిల్‌ 1కల్లా దీన్ని అందుబాటులోకి తెచ్చేలా చూడాలని ఆదేశించింది. ఈ మేరకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్​మెంట్​(​RTGS) సిస్టమ్, నేషనల్​ ఎలక్ట్రానికి ఫండ్స్​ ట్రాన్స్​(NEFT) సిస్టమ్​లో డైరెక్ట్​ మెంబర్స్​ లేదా సబ్​-మెంబర్స్​సోమవారం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది ఆర్​బీఐ. ఈ రెండు వ్యవస్థల్లోని సభ్యులుగా ఉన్న బ్యాంకులు వారి వారి వినియోగదారులకు ఇంటెర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్​లో ఈ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పింది. బ్యాంకులన్నీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌పీసీఐకి గడువును కూడా నిర్దేశించింది.

అయితే కల్పించిన ఈ సదుపాయానికి సంబంధించి ఎలాం సమాచారాన్ని స్టోర్​ చేసుకోరాదని ఎస్​పీసీఐకి ఆర్​బీఐ చెప్పింది. ఎవైనా వివాదాలు ఉంటే లుక్​అప్​ రిఫరెన్స్​ నంబర్​ వంటి వివరాల ఆధారంగా లవాదేవీలు జరుపుకునే బ్యాంకులు వాటిని పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఈ కొత్త సౌకర్యాన్ని కస్టమర్లకు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పింది.

ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్- UPI, ఇంటర్​మీడియెట్ పేమెంట్స్​ సర్వీస్- IMPSలో లబ్ధిదారుడి బ్యాంకింగ్ పేరు కనిపించే వ్యవస్థ ఉంది. కొత్తగా రియల్‌ RTGS, NEFT వ్యవస్థల్లోనూ విస్తరించనున్నారు. పొరబాటు చెల్లింపులను తగ్గించేందుకు ఈ సదుపాయం ఎంతగానో ఉయోగపడనుంది. దీనివల్ల పేమెంట్ చేసేటప్పుడు అకౌంట్‌ నంబర్‌, బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎంటర్ చేసేటప్పుడు అవతలి వ్యక్తి పేరు కూడా కనిపిస్తుంది. తద్వారా చెల్లింపుల్లో పొరబాట్లకు ఆస్కారం తగ్గుతుంది. యూపీఐ సదుపాయం పాపులర్‌ కాకముందు ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ పేమెంట్ సదుపాయాలు విస్తృతంగా వాడుకలో ఉండేవి. పెద్దమొత్తంలో సొమ్ములు పంపించేందుకు వీటిని ఇప్పటికీ వినియోగిస్తుంటారు. ఈ పేమెంట్ల కోసం బ్యాంక్‌ ఖాతా నంబర్‌, బ్యాంక్‌ పేరు, బ్రాంచి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, అమౌంట్ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details