తెలంగాణ

telangana

ETV Bharat / business

టికెట్స్​పై 10% డిస్కౌంట్‌, ఎక్స్​ట్రా 10కిలోల లగేజ్- స్టూడెంట్స్​కు ఎయిర్‌ ఇండియా బంపర్​ ఆఫర్ - AIR INDIA OFFERS FOR STUDENT

ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్స్ - దేశ, విదేశీ ప్రయాణాలపై స్పెషల్ డిస్కౌంట్స్ - అదనంగా 10 కేజీల వరకు ఫ్రీ బ్యాగేజ్‌ తీసుకెళ్లే అవకాశం - మహారాజా క్లబ్ రివార్డ్స్ కూడా!

Air India Exclusive Offers For Student
Air India Exclusive Offers For Student (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2024, 5:24 PM IST

Air India Exclusive Offers For Student : దేశ, విదేశీ పర్యటనలు చేయాలనుకునే విద్యార్థుల కోసం ఎయిర్‌ ఇండియా స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. డిసెంబర్‌ 18 నుంచే ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్‌ - ఏదైనా సరే బేస్‌ ఛార్జీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాదు విద్యార్థులు ఉచితంగా 10 కేజీల వరకు అదనంగా బ్యాగేజ్ తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తోంది. కనుక విదేశీ పర్యటనలకు, సాహస యాత్రలకు కావాల్సిన సామగ్రి అంతా తీసుకెళ్లడానికి వీలవుతుంది. అంతేకాదు ఎయిర్ ఇండియా వైబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా చేసిన బుకింగ్‌లపై కాంప్లిమెంటరీగా ఒకసారి ప్రయాణ తేదీని మార్చుకునే వీలు కల్పిస్తారు.

మీరు భారతదేశం అంతటా తిరగాలని అనుకున్నా లేదా యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లాలని అనుకున్నా సరే - ఎయిర్‌ ఇండియా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన పెర్క్‌లను అందిస్తోంది.

ఈ బెనిఫిట్స్ కూడా
ఎయిర్‌ ఇండియా యాప్‌ ద్వారా చేసే పేమెంట్స్‌పై అదనపు డిస్కౌంట్స్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా డొమెస్టిక్‌ ఫ్లైట్‌ టికెట్ బుక్‌ చేసుకుంటే రూ.399 విలువైన కన్వీనియన్స్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అదే అంతర్జాతీయ ప్రయాణాలకైతే రూ.999 వరకు ఫీజు మినహాయింపు దొరుకుతుంది.

ఎయిర్‌ ఇండియా భాగస్వామి బ్యాంకులకు చెందిన యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌, క్రెడిట్/ డెబిట్ కార్డ్‌ల ద్వారా చేసే చెల్లింపులపై కూడా డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ ఆఫర్లు అన్నీ కలుపుకుంటే - విద్యార్థులు తమ ప్రయాణ ఖర్చులపై దాదాపు 25 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

గుడ్ ఎక్స్‌పీరియన్స్‌
ఇయిర్ ఇండియా భారతదేశంలోని 49 నగరాలకు, 42 అంతర్జాతీయ డెస్టినేషన్స్‌కు నాన్‌-స్టాప్‌ విమాన సర్వీసులు నడిస్తుంది. కనుక స్వదేశీ, విదేశీ ప్రయాణాలు మీకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని ఎయిర్‌ ఇండియా చెబుతోంది.

విమానంలో ప్రయాణించేటప్పుడు మీకు ఉచితంగా ఎంటర్‌టైన్‌మెంట్ కల్పిస్తారు లేదా ఎయిర్‌లైన్ విస్తారా స్ట్రీమ్ వైర్‌లెస్‌ స్ట్రీమింగ్ సేవలను అందిస్తారు. సుదూర విమాన ప్రయాణాలు చేసేటప్పు ఫ్రీ వైఫై కనిక్టివిటీ ఉంటుంది. కనుక ప్రయాణికులు ఎలాంటి అలసట లేకుండా, హాయిగా ఎంజాయ్ చేస్తూ తమ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని ఎయిర్ ఇండియా చెబుతోంది.

మహారాజా క్లబ్ రివార్డ్స్ కూడా!
ఎయిర్ ఇండియా మహారాజా క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది. కనుక ఈ ప్రోగ్రామ్‌లో చేరిన వారు ఉచిత టికెట్‌లు, ప్రత్యేకమైన రివార్డ్‌లు, అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు. మీరు కనుక ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసుకుంటే 33 శాతం అదనంగా రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు.

ఎయిర్‌ ఇండియా బెనిఫిట్స్‌ పొందడానికి అర్హులు ఎవరు?
ఎయిర్ ఇండియా అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్స్, బెనిఫిట్స్ పొందాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. అవి ఏమిటంటే?

  • దేశీయ విమానాల్లో ప్రయాణానికి కనీసం 12 ఏళ్ల వయస్సు దాటి ఉండాలి.
  • అంతర్జాతీయ ప్రయాణానికి అయితే 12 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • విద్యార్థి/ విద్యార్థిని కనీసం ఒక విద్యా సంవత్సరానికి ఫుల్‌ టైమ్ అకాడమిక్‌ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకుని ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో చదువుతుండాలి. లేదా
  • కేంద్ర, రాష్ట్ర విద్యా మండలి చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థలో చదువుతూ ఉండాలి.
  • చెల్లుబాటు అయ్యే స్టూడెంట్ ఐడీ, వీసా, యాక్సెప్టెన్స్‌ లెటర్ కచ్చితంగా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details