5 Star Rating Cars :నేడు దేశంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే చాలా మంది తమ కుటుంబ భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటివారి కోసమే, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మంచి సేఫ్టీ ఫీచర్లలు ఉన్న కార్లను రూపొందించి, మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో 5-స్టార్ రేటింగ్ ఉన్న టాప్-10 కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Tata Harrier Safety Features :గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (G-NCP) నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన బెస్ట్ కారు టాటా హారియర్. దీనిలో ఏయే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయంటే?
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
- కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
- హిల్ హోల్డ్ అసిస్ట్
- పానిక్ బ్రేక్ అలర్ట్
- రియర్ పార్కింగ్ సెన్సార్
- యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)
Tata Harrier Safety Price :మార్కెట్లో ఈ టాటా హారియర్ కారు ధర సుమారుగా రూ.15.49 లక్షలు - రూ.25.49 లక్షల రేంజ్లో ఉంటుంది.
2. Tata Safari Safety Features :టాటా కంపెనీకి చెందిన మరో సేఫెస్ట్ కార్ సఫారీ. ఈ ఎస్యూవీ కారు కూడా గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (G-NCP) నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది. దీనిలోని సేఫ్టీ ఫీచర్స్ ఏమిటంటే?
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
- కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
- హిల్ హోల్డ్ అసిస్ట్
- ట్రాక్షన్ కంట్రోల్
- రియర్ పార్కింగ్ సెన్సార్
- యాంటీ-క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)
Tata Safari Safety Price :మార్కెట్లో ఈ టాటా సఫారీ కారు ధర సుమారుగా రూ.16.19 - రూ.25.49 లక్షల వరకు ఉంటుంది.
3. Volkswagen Virtues Safety Features :ఈ మోస్ట్ పాపులర్ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ కారు 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. దీనిలో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఏమిటంటే,
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
- ట్రాక్షన్ కంట్రోల్
- హిల్ హోల్డ్ అసిస్ట్
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
- బ్రేక్ అసిస్ట్
- ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్
Volkswagen Virtues Price :మార్కెట్లో ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ కారు ధర సుమారుగా రూ.11.48 లక్షల నుంచి రూ.19.29 లక్షల వరకు ఉంటుంది.
4. Skoda Slavia Safety Features :ఈ స్కోడా స్లావియా ఒక ప్రీమియం మిడ్ సైజ్ సెడాన్ కార్. గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (G-NCP) నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన బెస్ట్ కారు ఇది. దీనిలో ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ఏబీఎస్ విత్ ఈబీడీ
- మల్టీ కొలిజన్ బ్రేకింగ్
- ట్రాక్షన్ కంట్రోల్
- హిల్ హోల్డ్ కంట్రోల్
- టీపీఎంఎస్
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
Skoda Slavia Price :మార్కెట్లో ఈ స్కోడా స్లావియా కారు ధర సుమారుగా రూ.10.48 లక్షలు - రూ.19.12 లక్షలు ఉంటుంది.
5. Skoda Kushaq Safety Features :గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (G-NCP) నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన మరో మంచి కారు స్కోడా కుషాక్. దీనిలో ఉన్న బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ :
- 6-ఎయిర్‌బ్యాగ్స్
- ట్రాక్షన్ కంట్రోల్
- ఏబీఎస్
- హిల్-హోల్డ్ అసిస్ట్
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
- టీపీఎంఎస్
- మల్టీ కొలిజన్ బ్రేకింగ్
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్
Skoda Kushaq Price :మార్కెట్లో ఈ స్కోడా కుషాక్ ఎస్యూవీ ధర సుమారుగా రూ.10.89 లక్షలు - రూ.20 లక్షలు వరకు ఉంటుంది.