తెలంగాణ

telangana

ETV Bharat / business

హోండా థర్డ్ జనరేషన్ అమేజ్​లో అదిరిపోయే ఫీచర్స్! తెలిస్తే షాకవ్వాల్సిందే! లాంఛ్ ఎప్పుడంటే? - HONDA AMAZE THIRD GENERATION

భారత్ మార్కెట్లోకి హోండా అమేజ్​ థర్డ్ జనరేషన్! ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే!

Honda Amaze Third Generation
Honda Amaze Third Generation (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 2:50 PM IST

Honda Amaze Third Generation Specifications : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత్ మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ అమేజ్ కారును లాంఛ్​ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. థాయిలాండ్​లోని హోండా ఆర్ అండ్ డీ ఆసియా పసిఫిక్ సెంటర్‌లో డిజైన్ చేసిన 2024 అమేజ్ కారును డిసెంబర్ 4న మార్కెట్​లోకి విడుదల చేయనుంది. అయితే కొత్త జెనరేషన్​ కారులో హోండా పలుమార్పులు చేసినట్లు, ముఖ్యంగా అధునాతన ఫీచర్స్​ను పొందుపరిచినట్లు సమాచారం. అవేంటంటే?

థర్డ్ జనరేషన్ హోండా అమేజ్ మోడల్​లో ఎల్ఈడీ హెడ్ లైట్లతోపాటు రీ డిజైన్డ్ గ్రిల్​, జడ్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, న్యూ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్డ్ డాష్ బోర్డ్, స్లీక్ ఎయిర్ వెంట్స్, న్యూ ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్​తోపాటు సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయని తెలుస్తోంది.

హోండా అమేజ్ కారు 1.2 లీటర్ల 4 సిలిండర్ ఎస్ఓహెచ్​సీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ (90 పీఎస్ పవర్​, 110 ఎన్ఎం టార్క్)తో అందుబాటులోకి రాబోతుందని సమాచారం. ఈ కారులో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా​ ఉంటుందని తెలుస్తోంది. కారు క్యాబిన్ నలుపు, లేత గోధుమరంగు(beige) రంగులో, సీట్స్​ ఇంటీరియర్ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయని సమాచారం.

పాత మోడల్ హోండా అమేజ్ కారు ధర రూ.7.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.9.95 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. న్యూ హోండా అమేజ్ ధర బహుశా రూ.7.25 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుందని అంచనా. హోండా తన ఫస్ట్ జనరేషన్ అమేజ్ కారును 2013లో, సెకండ్ జనరేషన్​ను 2018లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తీసుకొస్తున్న థర్ట్ జనరేషన్​ అమేజ్​ మోడల్​ - మారుతి సుజుకి న్యూ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ మోడల్ కార్లతో కచ్చితంగా పోటీ పడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details