Woman Gang Raped In Pune :మహారాష్ట్రలోని పుణెలో ఓ యువతి, తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. పుణె శివారు బోప్దెవ్ ఘర్ ప్రాంతంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి 10 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఫ్రెండ్ను కొట్టి యువతిపై గ్యాంగ్ రేప్- నిందితుల కోసం 10పోలీస్ టీమ్స్ హంట్! - Woman Gang Raped In Pune - WOMAN GANG RAPED IN PUNE
Woman Gang Raped In Pune : తనపై ముగ్గురు దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
Published : Oct 4, 2024, 10:20 AM IST
|Updated : Oct 4, 2024, 10:41 AM IST
కోఢ్వా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ యువతి తన స్నేహితుడితో గురువారం బయటకు వెళ్లింది. వారిద్దరూ బోప్దెవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లారు. రాత్రి 11 సమయంలో ముగ్గురు దుండగులు యువతి స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, జాయింట్ సీపీ రంజన్ కుమార్ శర్మ చెప్పారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.
ప్రజల్లో తీవ్ర ఆగ్రహం : శరద్ పవార్
ఈ ఘటనపై ఎన్సీపీ-ఎస్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఓవైపు లడ్కీ బెహన్ యోజన ద్వారా మహిళలు ప్రయోజనం పొందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, మరోపక్క మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 'ఒక వైపు మహిళలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది, మరోవైపు వారిపై పెరుగుతున్న అఘాయిత్యాల పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వక్తమవుతోంది' అని శరద్ పవార్ శుక్రవారం అన్నారు.