తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్యకర్తపై లైంగిక వేధింపులు​- ప్రజ్వల్ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్ - Suraj Revanna Sexual Assault Case - SURAJ REVANNA SEXUAL ASSAULT CASE

Suraj Revanna Sexual Assault Case : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మరువకముందే ఆయన సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తపై సూరజ్ లైంగిక వేధంపులకు పాల్పడినట్లు కైసు నమోదైంది.

Suraj Revanna Sexual Assault Case
Suraj Revanna Sexual Assault Case (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 9:20 AM IST

Updated : Jun 23, 2024, 9:36 AM IST

Suraj Revanna Sexual Assault Case : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్​పై​ స్వలింగ వేధింపులకు పాల్పడ్డారంటూ జేడీఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

జూన్​ 16 సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్​హౌస్​లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని శనివారం హూళెనరసిపురా పోలీస్​ స్టేషన్​లో చేతన్ అనే పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. 'లోక్‌సభ ఎన్నికల సమయంలో చేసిన పనిని చూసి నా ఫోన్​ నంబర్​ను సూరజ్​ అడిగారు ఈ క్రమంలో ఖాళీగా ఉన్నప్పడు వచ్చి కలవాలని చెప్పారు. జూన్ 16 సాయంత్రం హసన్​ జిల్లాలోని గన్నికాడ గ్రామంలో ఉన్న ఫామ్​హౌస్​​ వెళ్లాను. ఆ తర్వాత సూరజ్​ వచ్చి లోపల నుంచి తాళం వేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అలాగే రాజకీయాల్లో ముందుకు వెళ్లేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. నేను ఒప్పకోకపోవడం వల్ల బెదిరించి, ఫోన్ చేసినప్పుడల్లా పామ్​హౌస్​​ రావాలని హెచ్చరించారు. జూన్​ 17న సూరజ్​ స్నేహితుడు శివకుమార్ వచ్చి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పవద్దని, అందుకు రూ.2 కోట్లు, ఉద్యోగం ఇప్పిస్తాని చెప్పారు' అని చేతన్​ పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్​పై ఐపీసీ సెక్షన్ 377, 506(బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్​ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్​ను అరెస్ట్ చేశారు.

రూ. 5 కోట్ల కోసం డిమాండ్
మరోవైపు ఈ ఆరోపణలను సూరజ్​ రేవణ్ణ తీవ్రంగా ఖండించారు. రూ. ఐదు కోట్లు ఇవ్వాలని చేతన్ డిమాండ్‌ చేశాడనీ లేకపోతే కేసు పెడతానని బెదిరించాడని సూరజ్‌ తెలిపారు. ముందుగా తన స్నేహితుడైన శివకుమార్‌ దగ్గరకు ఉద్యోగం ఇప్పించాలని అతడు వచ్చాడనీ, ఉద్యోగం ఇప్పించకపోవడం వల్ల రూ.5 కోట్లు డిమాండ్‌ చేశాడని వివరించారు. ఆ తర్వాత రూ.2 కోట్లకు తగ్గిందని శివకుమార్‌ శుక్రవారమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఉద్యోగ అవసరాల కోసం వచ్చిన మహిళలను ఆయన శారీరకంగా ఉపయోగించుకున్నాడని ఆయనపై ఆరోపణలున్నాయి.

రైతుకు దొరికిన భారీ డైమండ్​- రాత్రికి రాత్రే లక్షాధికారిగా! ఇది రెండోసారట!!

CBI చేతికి నీట్ లీకేజీ కేసు- ప్రధాన సూత్రధారి సంజీవ్‌ ముఖియానే! - NEET UG 2024 Paper Leak

Last Updated : Jun 23, 2024, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details