Mumbai Boat Accident :ముంబయి తీరంలో బుధవారం పడవ ప్రమాదం జరిగింది. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణికులతో వెళ్తోన్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారని, 101 మందిని కాపాడినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.
ముంబయి తీరంలో మునిగిన ఫెర్రీ- 13 మంది మృతి - 101 మంది సేఫ్ - MUMBAI BOAT ACCIDENT
ముంబయి తీరంలో పడవ ప్రమాదం - ఇద్దరు మృతి - 77మంది సేఫ్!
Published : 5 hours ago
కాగా, ఈ ఘటన ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ లభ్యం కాలేదని, వారికోసం గాలింపు కొనసాగుతోందని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నేవీ, కోస్టు గార్డు బృందాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. నేవికి చెందిన 11 బోట్లు, మెరైన్ పోలీసులకు చెందిన మూడు బోట్లు, కోస్టు గార్డు చెందిన బోటు రంగంలోకి దిగాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాలుగు హెలికాప్టర్లు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు 80 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.