తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పట్టుకునేందుకు ట్రై చేస్తే కత్తితో పొడిచాడు' - దాడి ఎలా జరిగిందో చెప్పిన సైఫ్ అలీఖాన్! - SAIF ALI KHAN ATTACK

సైఫ్‌ అలీఖాన్‌ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పోలీసులు- తెల్లవారుజామున 2.30గంటల సమయంలో దాడి జరిగినట్లు చెప్పిన సైఫ్

Saif Ali Khan Attack
Saif Ali Khan (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2025, 11:34 AM IST

Saif Ali Khan Attack :ముంబయిలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్‌ అలీఖాన్‌ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. గురువారం రాత్రి ఆయన స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. తనపై ఏ విధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో సైఫ్​ అలీఖాన్ పోలీసులకు వివరించినట్లు సమాచారం. నిందితుడిని గట్టిగా పట్టుకున్నప్పటికీ, పదేపదే వీపుపై దాడి చేయటం వల్ల పట్టు సడలినట్లు సైఫ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

"నేను కరీనా మా గదిలో ఉన్నాం. సడెన్​గా చిన్న కుమారుడు జెహ్​ ఏడుపు వినిపించింది. బయటకు వచ్చిన చూస్తే అక్కడ ఓ దుండగుడు స్టాఫ్​ నర్స్​పై దాడి చేస్తున్నాడు. నేను అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించాను. వెంటనే అతడు నా వీపు మెడ, చేతులపై కత్తితో దాడి చేశాడు. తెల్లవారుజామున 2.30 నుంచి 2.40 గంటల మధ్య ఈ ఘటన జరిగింది" అని పోలీసులకు సైఫ్​ వివరించారు. ఇదివరకే ఈ ఘటనకు సంబంధించి సైఫ్‌ భార్య, నటి కరీనాకపూర్‌ వాంగ్మూలం కూడా పోలీసులు నమోదు చేశారు.

సైఫ్‌ ఇంటి వద్ద పోలీసు భద్రత
మరోవైపు సైఫ్​పై దాడి నేపథ్యంలో ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రెండు షిఫ్టుల్లో భద్రత విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ జరిగింది
జనవరి 16న సైఫ్‌పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్​కు తీవ్ర గాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు.

మరోవైపు, ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించి కొన్ని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. అతడు భారత్‌లో విజయ్‌దాసుగా పేరు మార్చుకున్నట్లు తెలిపారు.

'సైఫ్​​పై నిజంగా దాడి జరిగిందా లేక నటిస్తున్నారా? డిశ్చార్జ్ టైమ్​లో డ్యాన్స్ ఏంటి?'

హెల్ప్​ చేసిన ఆటో డ్రైవర్​ను కలిసిన సైఫ్- ప్రేమతో ఒక హగ్ ఇచ్చిన హీరో

ABOUT THE AUTHOR

...view details