తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీతో ఆర్​ఎల్​డీ దోస్తీ- ఎన్​డీఏ కూటమితో ఎన్నికల బరిలోకి! - RLD BJP Alliance In UP

RLD BJP Alliance In UP : యూపీలో జయంత్ చౌధరీ నేతృత్వంలోని ఆర్​ఎల్​డీ పార్టీ ఎన్​డీఏ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఎక్స్​ వేదికగా తెలిపారు.

RLD BJP Alliance In UP
RLD BJP Alliance In UP

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:50 PM IST

Updated : Mar 3, 2024, 7:11 AM IST

RLD BJP Alliance In UP :ఎన్​డీఏ కూటమిలోకి మరోపార్టీ చేరింది. ఉత్తర్​ప్రదేశ్​లో జయంత్ చౌధరీ నేతృత్వంలోని ఆర్​ఎల్​డీ పార్టీ శనివారం అధికారికంగా ఎన్​డీఏలో చేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఎక్స్​లో ట్వీట్ చేశారు. 'జయంత్ చౌధరీ నేతృత్వంలోని ఆర్​ఎల్​డీ ఎన్​డీఏలో చేరడం వల్ల రైతులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటాలని, అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఎన్‌డీఏ కట్టుబడి ఉంది' అని అమిత్ షా అన్నారు. అంతకుముందు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు జయంత్ చౌధరీ. ఇక ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఉత్తర్​ప్రదేశ్​లో జయంత్ చౌధరీ నేతృత్వంలోని ఆర్​ఎల్​డీ ఎన్​డీఏ కూటమిలో చేరడంపై స్పందించిన జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 'హోం మంత్రి అమిత్​షా సమక్షంలో ఆర్​ఎల్​డీ అధ్యక్షుడు జయంత్ చౌదరిని కలిశాను. ఎన్​డీఏ కుటుంబంలోకి ఆయనను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో తమ మిత్ర పక్షాలకు ఆరు సీట్లు ఇవ్వాలని ఎన్​డీఏ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్నా దల్(సొనెలాల్ పార్టీ), సుహెల్​ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నిషాద్​ పార్టీ, రాష్ట్రీయ లోక్​దళ్ ఎన్​డీఏ కూటమిలో ఉన్నాయి. అయితే ఉత్తర్​ప్రదేశ్​లో రాష్ట్రీయ లోక్​దళ్​ ఎన్ని సీట్లలో పోటీచేస్తుందనే విషయంపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది.

వచ్చే ఎన్నికల వరకు ఎన్డీఏలోనే
వచ్చే లోక్​సభ ఎన్నికల వరకు మా పార్టీ ఎన్​డీఎతో కలిసి పోటీ చేస్తుందని రాష్ట్రీయ లోక్​దళ్ కార్యదర్శి అనుపమ్ మిశ్రా వెల్లడించారు. దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. మోదీ మూడో పర్యాయంలో ప్రభుత్వంలో రైతుల, నిరుద్యోగం లాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ సమస్యలకు పరిష్కరిస్తామని తెలిపారు.

బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​- వారణాసి నుంచి మోదీ పోటీ

సంక్షోభం అంచునే హిమాచల్‌! రెబల్​ వర్గంతో టచ్​లో మరో 9మంది ఎమ్మెల్యేలు

Last Updated : Mar 3, 2024, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details