Reasons For White Bedsheets Indian Railways :రైల్లో ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి.. రైల్వే సిబ్బంది తెల్లటి బెడ్షీట్లు, దిండ్లు అందిస్తారు. మరి.. ఎందుకు తెల్లటి రంగులో ఉన్న దుప్పట్లు, దిండులను అందిస్తారనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
పరిశుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తాయి :
మిగతా రంగులతో పోలిస్తే తెలుపు రంగులో ఉన్న బెడ్‌షీట్లు, దిండ్లు అందించడం వల్ల అవి తెల్లగా, పరిశుభ్రంగా ఉన్నట్లు ప్రయాణికులు అర్థం చేసుకుంటారు. అదే ఇతర రంగులో ఉన్న వాటిని అందించడం వల్ల అవి శుభ్రం చేసినా కూడా.. కొన్ని సార్లు ఆ ఫీలింగ్ కలిగించలేకపోవచ్చు. అందుకే రైల్వే అధికారులు తెలుపు రంగులో ఉండే వాటిని ప్రయాణీికులకు అందజేస్తున్నారు.
ట్రైన్ జర్నీలో ఇబ్బందులా? ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఒక్క కాల్ చేస్తే వెంటనే పరిష్కారం!
బ్యాక్టీరియా లేకుండా చేస్తారు :
భారతీయ రైల్వే నిత్యం ఎన్నో రైలు సర్వీసులను నడుపుతోంది. అయితే.. ప్రతిరోజు ఎన్నో వేల బెట్‌షీట్లు, దిండ్లు అవసరమవుతాయి. వీటిని నిత్యం ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి అందజేస్తుంటారు. అయితే.. ప్రయాణికులు ఒక్కసారి బెడ్‌షీట్‌లు వాడిన తర్వాత వాటిని శుభ్రం చేయడానికి లాండ్రీకి పంపిస్తారు. అక్కడ బాయిలర్‌లలో 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద శుభ్రం చేస్తారు. దాదాపు అరగంట సేపు వాటిని ఉతుకుతారట. దీనివల్ల పూర్తిగా వాటిపైన ఉన్న బ్యాక్టీరియా, మురికి మాయం అవుతాయి. సరిగ్గా క్లీన్ చేసిన భావన తెలుపులో మాత్రమే కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. పనివాళ్లు సరిగా శుభ్రం చేశారా లేదా? అన్నదాన్ని అధికారులు కూడా తెలుపు రంగులోనే ఈజీగా గుర్తించగలరు. కాబట్టి.. వైట్ సెలక్ట్ చేసినట్టు సమాచారం.
వాషింగ్ కూడా అనుకూలంగా ఉంటాయి :
మిగతా రంగులతో పోలిస్తే.. తెలుపు రంగులో ఉండే బెడ్‌షీట్‌లు, దిండులు వాషింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎలా అంటే.. డిటర్జెంట్లను ఉపయోగించి , అధిక ఉష్ణోగ్రత వద్ద ఉతికితే.. రంగు రంగులో ఉండే వస్త్రాలు త్వరగా రంగు కోల్పోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇవి పాతబడిపోయినట్టుగా కనిపిస్తాయి. చూడటానికి అంత బాగుండవు. ఇలాంటి వాటిని ప్రయాణికులకు ఇస్తే.. పాతవి ఇచ్చారనే భావన కలుగుతుంది. అదే తెలుపు రంగు బెడ్‌షీట్‌లు, దిండ్లను ఉపయోగిస్తే ఈ సమస్యలు ఉండవు. అందుకే వైట్ కలర్ ఉపయోగిస్తున్నారు.
- రకరకాల రంగుల బెడ్ షీట్లు సెలక్ట్ చేసుకుంటే.. క్లీన్ చేస్తున్నప్పుడు ఒకదాని కలర్ మరొకదానికి అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బెడ్‌షీట్లు చూడటానికి అంత ఆకర్షణీయంగా కనిపించవు. అన్నీ తెలుపు రంగువే అయితే ఈ సమస్య ఉండదు.
- అంతేకాదు.. తెలుపు రంగులో ఉన్న బెడ్‌షీట్‌పై ఏ వస్తువు పెట్టినా కూడా అది కనిపిస్తుంది. దీనివల్ల ప్రయాణికులు తమ వస్తువులను మర్చిపోకుండా ఉంటారు.
- ఇన్ని కారణాల వల్ల.. స్లీపర్ బోగీల్లో ప్రయాణించే వారికి తెల్లటి బెడ్షీట్లు, దిండ్లు మాత్రమే అందిస్తోంది రైల్వే శాఖ.
IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!
ప్రారంభమైన భారత్ గౌరవ్ రైలు.. కేవలం తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసమే.!