President Murmu at Maha kumbh 2025 :ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ఉదయం త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని, పుణ్యస్నానం ఆచరించి, పూజలు చేశారు.