తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర కార్మికులను గౌరవించిన మోదీ- పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు - PM Modi kuber tela

PM Modi Ayodhya Workers : అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులపై ప్రధాని మోదీ పూల వర్షం కురిపించి గౌరవించారు. మరోవైపు, రామమందిరం ప్రాంగణంలో ఉన్న జటాయువు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు

PM Modi Ayodhya Workers
PM Modi Ayodhya Workers

By PTI

Published : Jan 22, 2024, 4:23 PM IST

Updated : Jan 22, 2024, 5:32 PM IST

PM Modi Ayodhya Workers : రామజన్మభూమి అయోధ్యలో భక్తుల ఐదు శతాబ్దాల కల నెరవేరింది. ఎట్టకేలకు కోదండరాముడు కొలువుదీరాడు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసి దశరథపుత్రుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత వేడుకనుద్దేశించిన ప్రసంగించిన మోదీ, అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ గౌరవించారు.

సిబ్బందిపై ప్రధాని మోదీ పూల వర్షం
భవ్య రామ మందిర నిర్మాణంలో భాగమైన యావత్​ సిబ్బందిపై ప్రధాని మోదీ పూల వర్షం కురిపించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత కార్మికుల మధ్యకు వెళ్లారు మోదీ. అనంతరం వారికి కృతజ్ఞతలు తెలిపారు. తన వెంట పెద్ద బుట్టలో తెచ్చిన గులాబీ రేకులతోపాటు పూలను గౌరవసూచకంగా కార్మికులపై చల్లారు. ఆ సమయంలో కార్మికులు కూడా మోదీని నమస్కరించారు. అటు అయోధ్య రామమందిరం ప్రాంగణంలో ఉన్న జటాయువు విగ్రహంపై పూలు చల్లి ఆవిష్కరించారు మోదీ.

శివలింగానికి మోదీ జలాభిషేకం
అంతకుముందు, రామాలయ ప్రాంగణంలోని కుబేర్ తిలాను సందర్శించారు ప్రధాని మోదీ. అక్కడి శివదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి జలాభిషేకం చేసి ప్రదక్షిణలు చేశారు. కుబేర్ తిలాపై ఉన్న పురాతన శివాలయాన్ని కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పునరుద్ధరించింది.

అతిథులకు స్పెషల్ బ్యాగ్!
అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి విచ్చేసిన దాదాపు 7,000 మంది ప్రముఖులకు ప్రత్యేక ప్రసాదం ఇచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. అందుకు ప్రత్యేకంగా లఖ్​నవూలో 15వేల స్వీట్‌ బాక్సులను తయారు చేయించింది. వాటితోపాటు కొన్ని వస్తువులను ఓ బ్యాగ్​ లో పెట్టి అందించింది. బ్యాగ్​లో అయోధ్యపై పుస్తకం, రాముడి దీపం, తులసీదళం, శ్రీరాముడి పేరుతో ఉన్న కండువా ఇచ్చింది. నేతితో చేసిన నాలుగు లడ్డూలు, బెల్లం రేవ్‌డీ, రామదాన చిక్కీ, జీడిపప్పు, కిస్​మిస్​లు ప్రసాదంగా అందించింది.

దీక్ష విరమించిన మోదీ
అయోధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షను ప్రధాని నరేంద్ర మోదీ విరమించారు. రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోదీ తన ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప్రధాని మోదీకి చరణామృత్‌ను తాగించి దీక్ష విర‌మింప‌జేశారు. అనంతరం ప్రధాని స్వామి ఆశ్వీరాదం తీసుకున్నారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు ప్రధానిని స్వామి మహారాజ్‌ అభినందించారు. అయోధ్య కార్యక్రమం కోసం ప్రధాని నేలపై పడుకుంటూ, కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగుతూ. 11 రోజుల పాటు ప్రత్యేక అనుష్ఠానం పాటించారు.

'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'

కోట్లాది మంది కల సాకారం- అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు

Last Updated : Jan 22, 2024, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details