తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వచ్చే 100 రోజులు అత్యంత కీలకం, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలి'- కార్యకర్తలకు మోదీ సూచన - PM Modi At Party Convention

PM Modi At Party Convention : వచ్చే వంద రోజులు బీజేపీకి ఎంతో కీలకమని, అందరం కొత్త ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నవ భారత్‌ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.

PM Modi At Party Convention
PM Modi At Party Convention

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 2:54 PM IST

Updated : Feb 18, 2024, 3:14 PM IST

PM Modi At Party Convention : రానున్న వంద రోజులు బీజేపీకి అత్యంత కీలకమని, అందరూ కొత్త ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ అన్నారు. నవ భారత్‌ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు వెళ్లాలని మోదీ సూచించారు. పార్టీ కార్యకర్తలు 24 గంటలూ దేశానికి సేవ చేయడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారని మోదీ అన్నారు. దిల్లీలో రెండోరోజు జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశాల కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈసారి జరగబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్ల మైలురాయిని అందుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బీజేపీ సైన్యాన్ని చూస్తే విపక్షాలకు భయం పుడుతోందని అన్నారు. ఈ దేశ కలలు బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే నెరవేరతాయని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ త్వరలోనే అవతరిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. అలా మారుస్తానని తాను గ్యారంటీ ఇస్తున్నాని తెలిపారు.

"గత పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి. భారత దేశ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది. దేశం కోసం మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బీజేపీకి యువశక్తి, నారీశక్తి, కిసాన్ శక్తి ప్రధాన బలం. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన మహిళలతోనే ఆరోగ్యవంతమైన దేశం సాధ్యం. పోషణ్‌ అభియాన్‌ కింద గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నాం. గడిచిన పదేళ్లలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు'
10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, 25 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించామని మోదీ అన్నారు. టాయిలెట్ల నిర్మాణం అంటే గోడల నిర్మాణం కాదని, మహిళల గౌరవం పెంచేవి అని చెప్పారు. మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలని నిర్ణయించామని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు తెచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు నిర్మించామని, ప్రతి ఇంటికి మంచినీరు అందించడం ఈ ప్రభుత్వం లక్ష్యమని మోదీ చెప్పారు. వ్యవసాయంలో అత్యాధునిక పరికరాలు మన రైతులు వాడాలి ఆయన ఆకాంక్షించారు.

జాతీయ మండలి సమావేశాల్లో బేజేపీ తీర్మానం
అయోధ్య రామ మందిరంపై దిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశాల్లో బీజేపీ తీర్మానం చేసింది. అయోధ్య రామ మందిరం రానున్న వెయ్యేళ్లు దేశంలో రామ రాజ్య స్థాపనను తెలియజేస్తుందని పేర్కొంది. రాముని జన్మస్థలంలో రామ మందిర నిర్మాణం చరిత్రాత్మకమని, దేశం సాధించిన గొప్ప విజయమని తెలిపింది. భారతీయ నాగరికత, సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశంలోనూ శ్రీరాముడు, సీత, రామాయణం ఉండటం గమనార్హమని పేర్కొంది. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలు, అందరికీ న్యాయం కోసం అంకితమైందని, వాటిని రామరాజ్యం ఆదర్శాల నుంచే ప్రేరణ పొందిందని బీజేపీ తీర్మానించింది. భారత రాజ్యాంగం మూల ప్రతిలోని ప్రాథమిక హక్కుల సెక్షన్‌లో రాముడు, సీత, లక్షణుల చిత్రం ఉందని గుర్తు చేసింది. ప్రాథమిక హక్కులకు స్ఫూర్తి శ్రీరాముడేనని దాని ద్వారా అర్థమవుతుందని తెలిపింది. మహాత్మ గాంధీ హృదయంలో కూడా రామ రాజ్యం ఆలోచన ఉందని అదే నిజమైన ప్రజాస్వామ్యం అని గాంధీ అనేవారని ఆ తీర్మానం పేర్కొంది.

PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు- తొలి సీనియర్​ గ్రాడ్యుయేట్​గా రికార్డు!

'లోక్​సభ ఎన్నికలు మహాభారతం యుద్ధం లాంటివి- మళ్లీ మోదీ ప్రధాని అవ్వడం పక్కా!'

Last Updated : Feb 18, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details