NHRC Notice To Uttar Pradesh Government :ఝాన్సీ జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 10మంది చిన్నారులను బలిగొన్ని అగ్నిప్రమాద ఘటన ఉత్తర్ప్రదేశ్లో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్న ఎన్హెచ్ఆర్సీ, నిర్లక్ష్యం జరిగిందని సూచిస్తున్నాయని పేర్కొంది. బాధితులు ప్రభుత్వ సంరక్షణలో ఉన్నందున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై వారంలో రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ స్టేటస్, బాధ్యులన అధికారులపై తీసుకున్న చర్యలు, క్షతగాత్రులకు అందుకున్న వైద్యం. బాధిత కుటంబాలకు ఇస్తున్న పరిహారం వివరాలు నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి టనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యల గురించి కూడా తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు కమిషన్ వెల్లడించింది.
నిజ నిర్ధరణ కమిటీ
ఈ ఘటనపై నిజనిర్ధరణకు ప్రభుత్వం నలుగురితో కూడిన కమిటీ వేసింది. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదికను ఏడురోజ్లులోగా ప్రభుత్వానికి కమిటీ అందించనుంది. చిన్నారుల మృతికి కారణం ఆసుపత్రిలో భద్రతా లోపాలేనని వస్తున్న ఆరోపణలను యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పతాక్ ఖండించారు. వైద్య కళాశాలలో అన్ని అగ్నిమాపక పరికరాలు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగిందన్న బ్రిజేష్ ఫిబ్రవరిలో మాక్ డ్రిల్‌ని కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో అగ్నిమాపక పరికరాలు పనిచేయట్లేదని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వైద్యకళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర సింగ్ తెలిపారు.