Naxalites Killed BJP leader In Bijapur :ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లో స్థానిక బీజేపీ నేతను హత్య చేశారు మావోయిస్టులు. ఓ గ్రామంలో కుంటను తవ్విస్తుండగా, అక్కడికి చేరుకున్న మావోయిస్టులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం ఐదు గంటల సమయంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కైలాశ్ నాగ్ అనే వ్యక్తి వృత్తి రీత్యా కాంట్రాక్టర్. బీజేపీ ట్రేడ్ సెల్ విభాగానికి ఆఫీస్ బేరర్‌గా అతడు పనిచేస్తున్నాడు. అయితే బుధవారం జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుంటను తవ్వేందుకు తన జేసీబీతో సహా అక్కడికి వెళ్లాడు కైలాశ్. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మావోయిస్టులు కైలాశ్‌ను దారుణంగా కాల్చి చంపారు. అనంతరం పని ప్రదేశంలోని జేసీబీని సైతం తగలబెట్టారు.
కాగా ఈ ఏడాది కాలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఇది ఎనిమిదో హత్య. గతవారమే బీజాపుర్ జిల్లాలోని తోయ్నర్ గ్రామానికి చెందిన తిరుపతిని హత్య చేశారు మావోయిస్టులు. ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా అతడిని హత్య చేశారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు బీజేపీ నేతను హత్య చేశారు. నారాయణపుర్ జిల్లాలోని కౌశల్నార్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రతన్ దూబేను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.
Bjp Leader Shot Dead in Moradabad :అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. నడి రోడ్డుపై బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు. మొరాదాబాద్‌లో స్థానిక రాజకీయ నేత అనూజ్ చౌదరి, మరొకరితో కలిసి ఆయన ఇంటి ముందు నడుస్తుండగా దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వెంబడించిన ముగ్గురు హంతకులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే అనూజ్ కుప్పకూలారు. మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శ్వనాథ్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.