Tips to Balance Working Mothers Life : గతంలో మహిళలు వంటింటికే పరిమితం అయ్యేవారు. కానీ, ప్రస్తుత రోజుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఇంటి పని, వంటపని, పిల్లల పెంపకం, ఉద్యోగం, కేరీర్.. ఇలా ఎన్నో బాధ్యతలను తమ భుజాలపై మోస్తుండడంతో.. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వారికోసం ఇవాళ (మార్చి 12) 'నేషనల్ వర్కింగ్ మామ్స్ డే' సందర్భంగా.. ఓ ప్రత్యేక కథనం అందిస్తున్నాం. ఇందులో పనిచేసే తల్లులు(Mothers)తమ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే ఒకవైపు తల్లిగా, కుటుంబ సంరక్షకురాలిగా.. మరోవైపు వృత్తిపరమైన జీవితంలో మంచి విజయాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మీకు టైమ్ కేటాయించుకోండి :వర్కింగ్ మదర్‌గా అన్ని పనుల్లో రాణించడమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని.. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం. కుటుంబ బాధ్యతలు, పనిఒత్తిడి, పిల్లలను చూసుకోవడం వంటివన్నీ ఉన్నా మీ కోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో వాకింగ్‌కు వెళ్లడం, మైండ్ ఫుల్ నెస్ కోసం ధ్యానం, యోగా లాంటి ప్రాక్టీస్ చేయడం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీపై కొంత ఒత్తిడి తగ్గడమే కాకుండా రోజంతా చురుకుగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.
రిలేషన్ షిప్స్ : వర్కింగ్ మామ్స్ తమ బాధ్యతలను సక్రమంలో నిర్వహించాలంటే బలమైన మద్దతు కూడగట్టుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పనిచేసే ఇతర తల్లులతో మంచి రిలేషన్స్ ఏర్పరుచుకోవడం ద్వారా మంచి సపోర్టివ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఏదైనా అవసరం పడినప్పుడు ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో వారి సహాయం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.