తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ పోటీలో గెలిస్తే రూ.కోటి సొంతం! PM 'ఫ్రీ కరెంట్' స్కీమ్​ కొత్త గైడ్​లైన్స్​ ఇవే! - Model Solar Village Component - MODEL SOLAR VILLAGE COMPONENT

Model Solar Village Component : దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 'సోలార్ మోడల్ విలేజ్​' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాల్లోని గ్రామాలకు పోటీ నిర్వహిస్తుంది. గెలిచిన గ్రామానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందిస్తుంది. మరి రూ.కోటి అందుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Model Solar Village Component
Model Solar Village Component (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 4:32 PM IST

Model Solar Village Component :దేశంలో సోలార్​ విద్యుత్​ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్​ బిజిలీ యోజన'. ఈ పథకంలో భాగంగా 'సోలార్ మోడల్ విలేజ్​' కాంపొనెంట్​ను అమలు చేసేందుకు సోమవారం ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని గ్రామాలు, సౌర విద్యుత్​ను ఉపయోగించడం, ఇంధన అవసరాల్లో స్వయం ప్రతిపత్తి పొందడం ఈ పథకం లక్ష్యం అని న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ అమలులో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి రూ.కోటి చొప్పున ఇప్పటికే రూ.800 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది.

ఎంపిక ఇలా
ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం, పోటీ పద్ధతిలో గ్రామాల ఎంపిక జరుగుతుంది. పోటీ పడే గ్రామం కచ్చితంగా రెవెన్యూ గ్రామం అయి ఉండాలి. ఆ గ్రామంలో జనాభా 5000(స్పెషల్​ కేటగిరీ రాష్ట్రాల్లో 2,000) కంటే ఎక్కువ ఉండాలి. అనంతరం జిల్లా స్థాయి కమిటీ (DLC) పోటీ గ్రామాల జాబితాను ప్రకటిస్తుంది. 6 నెలల తర్వాత, ఆయా గ్రామాల డిస్ట్రిబ్యూటెడ్​ రిన్యూవబుల్​ ఎనర్జీ (RE) కెపాసిటీని అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. జిల్లాలో అత్యధిక పునరుత్పాధక ఇంధన సామర్థ్యం ఉన్న గ్రామానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణలో, స్టేట్​/యూటీ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్​మెంట్​ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఎంపిక చేసిన గ్రామాలు సౌర శక్తి వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాయా, దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయా అని ఈ ఏజెన్సీ నిర్ధరిస్తుంది.

పీఎం సూర్య ఘర్ యోజన
కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం​ తీసుకొచ్చిన 'పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన' పథకానికి కేంద్ర కేబినెట్ 2024 ఫిబ్రవరి 29న ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్​టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్​టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం- అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్​- అప్లై చేసుకోండిలా

300 యూనిట్ల ఫ్రీ కరెంట్- ఏటా రూ.18 వేలు ఆదా- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details