తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు - 36 మంది మృతి - BUS ACCIDENT IN UTTARAKHAND

లోయలో పడ్డ బస్సు - 36 మంది మృతి, పలువురికి గాయాలు - సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.

Bus Accident In Uttarakhand
Bus Accident In Uttarakhand (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 10:46 AM IST

Updated : Nov 4, 2024, 1:58 PM IST

Bus Accident In Uttarakhand : ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బస్సు గర్వాల్ నుంచి రాంనగర్​కు వెళ్తుండగా అల్మోరాలోని కూపి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 28 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్పందించిన ప్రధాని, సీఎం
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని వాయుమార్గంలో తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్​గ్రేషియాను ప్రకటించారు. బస్సు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనతో సంబంధం ఉన్న వారిని సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Nov 4, 2024, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details