తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు- అరెస్ట్ చేసిన పోలీసులు

Maharashtra BJP MLA Firing : శివసేన నేత (శిందే వర్గం) గణ్‌పత్‌ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌ గైక్వాడ్‌ కాల్పులు జరిపారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్‌ గైక్వాడ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 12:26 PM IST

Updated : Feb 3, 2024, 1:09 PM IST

Maharashtra BJP MLA Firing
Maharashtra BJP MLA Firing

Maharashtra BJP MLA Firing: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గం నేత మహేష్‌ గైక్వాడ్‌పై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్‌ గైక్వాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. భూవివాదానికి సంబం‍ధించి మహేష్‌ గైక్వాడ్‌పై గణ్‌పత్‌ గైక్వాడ్‌ పోలీసు స్టేషన్‌లోనే కాల్పులకు తెగబడ్డారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌ హిల్‌లైన్ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

మహేష్‌కు సర్జరీ నిర్వహించామనీ అయినా ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఠాణెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన గణ్‌పత్ తన కుమారుడిపై పోలీసు స్టేషన్‌లో దాడి జరగడం వల్లే తుపాకీ ఉపయోగించినట్లు చెప్పారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే మహారాష్ట్రను నేరగాళ్ల సామ్రాజ్యంగా మార్చాలనుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఎంతో కాలంగా పరిష్కరం కాకుండా ఉన్న భూ వివాదానికి సంబంధించి మహేశ్, గణ్​పత్​తో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీస్​ స్టేషన్​లోనే మహేశ్‌పై గణ్​పత్​ గైక్వాడ్‌ ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేశ్​తో పాటు శివసేన ఎమ్మెల్యే రాహుల్‌ పాటిల్‌ కూడా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని జూపిటర్‌ హాస్పిటల్‌కు తరలించారు. గణ్​పత్​ గైక్వాడ్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. గణ్​పత్​ ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవటం వల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మైనర్​పై రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
మైనర్​పై అత్యాచారం కేసులో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు ఇటీవలే 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక నిందితుడికి రూ.10 లక్షల జరిమానా వేసింది. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్​దులార్ గోండ్​ 2014 నవంబరు 4న ఓ మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

DSP ఇంటి దగ్గరి బ్యాంకులో చోరీ- కాల్పులు జరిపి రూ.90లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

ఫ్యాక్టరీ మేనేజర్​పై పొరుగింటి వ్యక్తి కాల్పులు- ఆ గొడవ వల్లే!

Last Updated : Feb 3, 2024, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details