తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ చివరి దశ పోలింగ్- సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం ఓటింగ్ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections 2024 Phase 7 Live Updates : సార్వత్రిక సమరం ఏడో విడత పోలింగ్‌ ప్రారంభం అయింది. ఈ విడతలో 57 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Lok Sabha Elections 2024 Phase 7 Live Updates
Lok Sabha Elections 2024 Phase 7 Live Updates (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 6:35 AM IST

Updated : Jun 1, 2024, 1:51 PM IST

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌

  • సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్‌ నమోదు
  • 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
  • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • బిహార్‌ 48.86
  • చండీగఢ్‌ 62.80
  • హిమాచల్‌ప్రదేశ్‌ 66.56
  • ఝార్ఖండ్‌ 67.95
  • ఒడిశా 62.46
  • పంజాబ్‌ 55.20
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 54.00
  • బంగాల్‌ 69.89

3.45 PM

కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌

  • మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 శాతం పోలింగ్‌ నమోదు
  • 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
  • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • బిహార్‌ 42.95
  • చండీగఢ్‌ 52.61
  • హిమాచల్‌ప్రదేశ్‌ 58.41
  • ఝార్ఖండ్‌ 60.14
  • ఒడిశా 49.77
  • పంజాబ్‌ 46.38
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 46.83
  • బంగాల్‌ 58.46

1:50 AM

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.09 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • బిహార్‌ 35.65
  • చండీగఢ్‌ 40.14
  • హిమాచల్‌ప్రదేశ్‌ 48.63
  • ఝార్ఖండ్‌ 46.80
  • ఒడిశా 37.64
  • పంజాబ్‌ 37.80
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 39.31
  • బంగాల్‌ 45.07
  • 12:00 AM

ఏడో దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 26.3% ఓటింగ్ నమోదైంది.

  • బిహార్ 24.25%
  • చండీగఢ్ 25.03%
  • హిమాచల్ ప్రదేశ్ 31.92%
  • ఝార్ఖండ్ 29.55%
  • ఒడిశా 22.64%
  • పంజాబ్ 23.91%
  • ఉత్తరప్రదేశ్ 28.02%
  • బంగాల్ 28.10%
  • 11:27 AM

బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ భక్తియార్​పుర్ పోలింగ్​బూత్​​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్​ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హమిర్​పుర్​ పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు.

  • 9:56 AM

ఏడో దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.31% ఓటింగ్ నమోదైంది.

  • బిహార్ 10.58%
  • చండీగఢ్ 11.64%
  • హిమాచల్ ప్రదేశ్ 14.35%
  • ఝార్ఖండ్ 12.15%
  • ఒడిశా 7.69%
  • పంజాబ్ 9.64%
  • ఉత్తరప్రదేశ్ 12.94%
  • బంగాల్ 12.63%
  • 9:11 AM

EVM, VVPAను చెరువులో పారేసిన దుండగులు
బంగాల్​లో ఈవీఎమ్​, వీవీప్యాట్​ మెషీన్లను చెరువులో పారేశారు కొందరు వ్యక్తులు. దక్షిణ పరగణాల జిల్లా కుల్తాయ్​లోని బూత్​ 40, 41లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్​లోని మండిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓటేశారు. పంజాబ్​ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 7:38 AM

ఏడో విడతలో పలువురు ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బీజేపీ నేత తరణ్‌జిత్‌ సింగ్‌, లఖ్‌నౌర్‌లో ఆప్‌నేత రాఘవ్‌ చద్దా, జలంధర్‌లో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బీజేపీ హమిర్​పుర్ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్​, ఆయన భార్య శెఫాలీ ఠాకూర్​తో ఓటేశారు.

  • 7:30 AM

ఓటేసిన జేపీ నడ్డా
ఏడో దశలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్‌ ఓటు వేశారు ఓటేశారు. దిల్లీలో ఆప్​ ఎంపీ రాఘవ్ చద్దా ఓటేశారు. మరోవైపు తుది దశ పోలింగ్​లో యువత రికార్డు స్థాయిలో ఓటేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్​లో ట్వీట్ చేశారు.

  • 7:00 AM

పోలింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 57 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 10.06 కోట్ల మంది ఓటర్లు కోసం ఈసీ 1.09 లక్షల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ విడతలో పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు.

Lok Sabha Elections 2024 Phase 7 Live Updates :లోక్​సభ ఎన్నికల సమరంలో తుది విడతకు రంగం సిద్ధమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో మరికాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకుర్, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే, పంకజ్‌ చౌధరీ, అనుప్రియా పటేల్‌ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు.

18వ లోక్‌సభను కొలువుదీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటివరకు ఆరు దశల్లో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. మరోవైపు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్నాయి.

హ్యాట్రిక్​పై మోదీ గురి
ఏడో దశలోనే పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్​ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ, కేంద్ర మాజీమంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ 1996 తర్వాత తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 13 స్థానాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటముల మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఇక్కడి వారణాసి నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ గెలుపుపై గురిపెట్టిన మోదీపై కాంగ్రెస్‌ నుంచి అజయ్‌ రాయ్, బీఎస్పీ తరఫున అతహర్‌ జమాల్‌ లారీ పోటీ చేస్తున్నారు. బంగాల్‌లో తృణమూల్‌కు గట్టి పట్టున్న దక్షిణ ప్రాంతంలోని 9 స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది.

Last Updated : Jun 1, 2024, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details