తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా సాగిన తొలిదశ ఎన్నికలు- ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే? - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Elections 2024 Phase 1 Live Updates : దేశంలో లోక్​సభ ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 60శాతం ఓట్లు పోలయ్యాయి.

Lok Sabha Elections 2024 Phase 1 Live Updates
Lok Sabha Elections 2024 Phase 1 Live Updates

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 6:31 AM IST

Updated : Apr 19, 2024, 6:04 PM IST

6:00PM
సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో 102 లోక్​సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 60శాతం ఓటింగ్ నమోదైంది.

మధ్యాహ్నం 3 వరకు నమోదైన పోలింగ్‌ శాతం

  • అండమాన్‌ నికోబార్‌ 45.48
  • అరుణాచల్‌ప్రదేశ్‌ 55.05
  • అసోం 60.70
  • బిహార్‌ 39.73
  • ఛత్తీస్‌గఢ్‌ 58.14
  • జమ్ముకశ్మీర్‌ 57.09
  • లక్షద్వీప్‌ 43.98
  • మధ్యప్రదేశ్‌ 53.40
  • మహారాష్ట్ర 44.12
  • మణిపుర్‌ 63.03
  • మేఘాలయ 61.95
  • మిజోరం 49.77
  • నాగాలాండ్‌ 51.73
  • పుదుచ్ఛేరి 58.86
  • రాజస్థాన్‌ 41.51
  • సిక్కిం 52.72
  • తమిళనాడు 51.01
  • త్రిపుర 68.35
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 47.44
  • ఉత్తరాఖండ్ 45.62
  • బంగాల్‌ 66.34
  • 02.57 PM

దేశవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. ఒంటి గంట వరకు అత్యధికంగా త్రిపురలో 53.04 శాతం పోలింగ్‌ నమోదైంది. తమిళనాడులో 39.51, ఉత్తర్​ప్రదేశ్‌లో 36.96, ఉత్తరాఖండ్‌లో 37.33 , పశ్చిమ బంగాల్‌లో 50.96 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 42.57, బిహార్‌లో 32.41 , అసోంలో 45.12, అరుణాచల్ ప్రదేశ్‌లో 35.75, అండమాన్ నికోబార్ దీవుల్లో 35.70 శాతం పోలింగ్ నమోదైంది. జమ్ముకశ్మీర్‌లో 43.11, లక్ష్యద్వీప్‌లో 29.91 , మహారాష్ట్రలో 32.36, మణిపుర్ లో 46.92 , మధ్యప్రదేశ్‌లో 44.43 శాతం పోలింగ్ నమోదైంది. మేఘాలయలో 48.91, మిజోరంలో 37.43 , నాగాలాండ్‌లో 39.66, పుదుచ్చేరిలో 44.95, రాజస్థాన్‌లో 33.73 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్ లో 37.53 , సిక్కింలో 36.88 శాతం ఓటింగ్ నమోదైంది

12:00 AM

ఉదయం 11 గంటల వరకు తమిళనాడు 23.72 శాతం పోలింగ్‌ నమోదైంది. అండమాన్‌ నికోబార్‌లో 21.82, అరుణాచల్‌ప్రదేశ్‌లో 18.26, అసోం 27.22, బిహార్‌ 20.42, ఛత్తీస్‌గఢ్‌ 28.12, జమ్ముకశ్మీర్‌ 22.60, లక్షద్వీప్‌ 16.33 శాతం ఓటింగ్​ నమోదైంది. మధ్యప్రదేశ్‌లో 30.46, మహారాష్ట్ర 19.17, మణిపూర్‌ 28.19, మేఘాలయ 31.65, మిజోరం 26.56, నాగాలాండ్‌ 22.82, పుదుచ్ఛేరి 27.63, రాజస్థాన్‌ 22.51, సిక్కిం 21.20, త్రిపుర 33.86, ఉత్తర్‌ప్రదేశ్‌ 25.20, ఉత్తరాఖండ్ 24.83, బంగాల్‌ 33.56 పోలింగ్ శాతం నమోదైంది.

10:00 AM

ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 8.21 శాతం పోలింగ్ నమోదైంది. త్రిపురలో 15.21, ఉత్తర్‌ప్రదేశ్‌లో 12.66, ఉత్తరాఖండ్‌లో 10.54, బంగాల్‌లో 15.09 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 12.02, బిహార్‌లో 9.23, అసోంలో 11.15, అరుణాచల్‌ప్రదేశ్‌లో 5.98, అండమాన్ నికోబార్ దీవుల్లో 8.64 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో 6.44, సిక్కింలో 7.90 శాతం ఓటింగ్ నమోదైంది.

9:00 AM

రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు CM, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్​పై వచ్చి మరీ ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్​ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కింలోని సోరెంగ్‌లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్ ఇంఫాల్‌లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్‌కు ముందు మహిళలు పూజలు నిర్వహించారు.

08:20 AM

పోలింగ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఓటు వేశారు. RSS చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగ్‌పుర్ నుంచి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమనీ, ఆ హక్కు వినియోగించుకుని 100 శాతం పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్, భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్​, అజిత్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

7:00 AM

ప్రారంభమైన పోలింగ్
దేశంలో తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్​ ముగియనుంది. తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 మంది మహిళలు, 11,371 ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్​ 1 ముగియనుంది. జూన్​ 4న కౌంటింగ్ జరగనుంది.

తొలి దశలో కీలక స్థానాల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు. అందులో కేంద్ర మంత్రులు, నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్​తో పాటు మరో ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి గౌరవ్​ గగోయ్​, డీఎంకే నుంచి కనిమొళి కూడా తొలి దశలో పోటీ చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో పాపులర్​ అయిన బీజేపీ నేత అన్నామలై పోటీ చేస్తున్న కొయంబత్తూర్​లో కూడా తొలి విడతలో పోలింగ్​ జరగనుంది.

6:30 AM

Lok Sabha Elections 2024 Phase 1 Live Updates :దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్‌ కోసం లక్షా 87వేల పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది.

తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్​లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్ , సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మణిపుర్​లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మొదటి రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని దాని విలువను తక్కువగా అంచనా వేయకండని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగుకు మించింది మరొకటి లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల భాగస్వామ్య విప్లవాన్ని యువత ముందుండి నడిపించాలని పేర్కొన్నారు.

Last Updated : Apr 19, 2024, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details