Lok Sabha Election 2024 Budget Allocation :ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అందుకే మన దేశంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చు అవుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని పలు అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఎలక్షన్ బడ్జెట్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను శనివారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు ఎంత ఖర్చు కానుంది? దీని కోసం ప్రభుత్వం ఎంత కేటాయించింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం రూ.2,183.78 కోట్లను కేటాయించారు. అయితే దీనిని 2024 మార్చిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రూ.2,442.85 కోట్లకు పెంచారు.
- ఈ ఎన్నికల బడ్జెట్లో రూ.1000 కోట్లను లోక్ సభ ఎలక్షన్ల కోసం కేటాయించారు. గతేడాది ఇది కేవలం రూ.180 కోట్లు మాత్రమే ఉండేది. అలాగే గతేడాది ఓటర్ ఐడీ కార్డుల కోసం రూ.18 కోట్లు మాత్రమే కేటాయిస్తే, ఈ ఏడాది దానిని రూ.404.81 కోట్లకు పెంచారు.
- ఈవీఎంల కోసం బడ్జెట్లో రూ.34.84 కోట్లు కేటాయించారు. ఇతర ఖర్చుల కోసం రూ.1,003.20 కోట్లు అలాట్ చేశారు. ఈ విధంగా 2024 ఆర్థిక సంవత్సరంలోని ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా రూ.2,408.01 కోట్లు కేటాయించారు.