Kerala CM Convoy Accident :కేరళ సీఎం పినరయి విజయన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. తిరువనంతపురం జిల్లా వామనపురం వద్ద సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో పోలీసు ఎస్కార్ట్, ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు, అంబులెన్స్ కూడా ఉండడం గమనార్హం. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో ముఖ్యమంత్రిని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
CM కాన్వాయ్కి ప్రమాదం- ఐదు వాహనాలు ఢీ- వీడియో వైరల్!
కేరళ సీఎం కాన్వాయ్కి ప్రమాదం- ముఖ్యమంత్రి వాహనాన్ని ఢీ కొట్టిన పోలీస్ ఎస్కార్ట్
Published : Oct 28, 2024, 9:00 PM IST
|Updated : Oct 28, 2024, 10:29 PM IST
ఇలా జరిగింది!
సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్న అదే రోడ్డులో ఓ మహిళ స్కూటీపై వెళ్తోంది. ఆమె నడి రోడ్డుపై మలుపు తీసుకుంటుండగా వెనుకవైపు నుంచి వచ్చిన సీఎం కాన్వాయ్‌లోని పోలీసు వాహనం ఒక్కసారిగా ఆగింది. ఇక కాన్వాయ్‌లో వెనుక నుంచి వస్తున్న వాహనాలు కంట్రోల్ అవ్వలేదు. సడెన్ బ్రేక్స్ వేసినా ఫలితం లేకపోయింది. దీంతో వరుసగా ఐదు వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్ కూడా కాస్త డ్యామేజ్ అయ్యింది.
ఇక వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది కారులోంచి దిగి సీఎం వాహనం వద్దకు చేరుకుంది. అయితే ముఖ్యమంత్రి కారు పెద్దగా డ్యామేజ్ కాకపోవడం వల్ల అదే వాహనంలో ఆయనను అక్కడ నుంచి వెంటనే పంపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. నడిరోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రమాదానికి గురవ్వడం వల్ల స్థానికులు షాక్ అయ్యారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.