IRCTC Ganga Ramayan Yatra Package: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అతి తక్కువ ధరలకే పలు ప్రాంతాలనూ చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తాజాగా ‘గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ యాత్ర పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఈ ప్యాకేజీలో భాగంగా.. నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్, సారనాథ్, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్‌నవూ నుంచి హైదరాబాద్ వచ్చేయడం యాత్ర పూర్తవుతుంది.
ప్రయాణ వివరాలు చూస్తే..
- తొలి రోజు ఉదయం 9:40 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లెట్(6E 915) జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముందు గానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి లంచ్ ముగించుకొని కాశీ ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. తర్వాత గంగా ఘాట్ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు.
- రెండో రోజు ఉదయం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకొని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకొని మధ్యాహ్నానికి మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన ఉంటుంది. ఒకవేళ షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ రాత్రి బస కూడా వారణాసిలోనే ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ప్రయాగ్‌రాజ్ బయలుదేరుతారు. అక్కడ అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
6 రోజుల్లో కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టొద్దామా? - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ! -
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు.
- మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్లో బస ఏర్పాటు చేస్తారు.
- ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్లో టిఫెన్ పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి బస అక్కడే ఉంటుంది.
- ఆరో రోజు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్ చేరుకుంటారు.
- సాయంత్రం 4 గంటల కల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి వచ్చేస్తారు. దీంతో టూర్ కంప్లీట్ అవుతుంది.