INDIA Bloc Seat Sharing Bihar :బిహార్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలివే
కథియార్, కిషన్ గంజ్, పట్నా సాహిబ్, ససారాం, భాగల్‌పూర్, వెస్ట్ చంపారన్, ముజఫర్‌పుర్, సమస్తిపుర్, మహరాజ్ గంజ్ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బెగుసరాయ్, ఖగారియా, అర్హ్, కరకట్, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన 26 చోట్ల ఆర్జేడీ తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది.
అప్పుడు కాంగ్రెస్ ఒక్కచోటే
రాష్ట్రంలోని 40 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో విజయం సాధించగా- ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయాయి.