తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో చేసే పూరీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే హోటల్​ స్టైల్లో చక్కగా వస్తాయి, ఇంకా సూపర్ టేస్టీ! - How to Make Poori in Hotel Style - HOW TO MAKE POORI IN HOTEL STYLE

How to Make Poori in Hotel Style : చాలా మందికి నచ్చిన బ్రేక్​ఫాస్ట్​లో.. పూరీ తప్పకుండా ఉంటుంది. వేడి వేడి పూరీని.. స్పెషల్​ ఆలూ కుర్మాలో ముంచుకుని అద్భుతమైన టేస్ట్​ను ఆస్వాదిస్తుంటారు. అయితే.. హోటల్​లో తిన్నప్పుడు వచ్చిన రుచి.. ఇంట్లో పూరీ తిన్నప్పుడు రాదు. అంతేకాదు.. ఇంట్లో చేసే పూరీ కనీసం చక్కగా పొంగదు కూడా! మరి.. చక్కటి పూరీని ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

How to Make Puri in Hotel Style
How to Make Poori in Hotel Style (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 3:21 PM IST

How to Make Puri in Hotel Style : హోటల్​లో పూరీ తింటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. చక్కగా ఉబ్బుతాయి. ఇంకా మెత్తగా కూడా ఉంటాయి. కానీ.. ఇంట్లో పూరీలు తయారు చేస్తే మాత్రం తేడాగా ఉంటాయి. సరిగా పొంగవు. మెత్తగా కూడా ఉండవు. ఇంకా.. రొట్టెల్లా గట్టిపడతాయి. మరి.. ఎందుకిలా? హోటల్లో మాదిరిగా మన ఇంట్లో పూరీలు కూడా చక్కగా పొంగుతూ రావాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

మైదా..

పూరీలు మెత్తగా ఉబ్బుతూ రావాలంటే.. ఎలాంటి పిండిని సెలక్ట్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యమని ప్రముఖ షెఫ్స్​ సూచిస్తున్నారు. పూరీలు తయారు చేయడానికి గోధుమతోపాటుగా మైదా పిండిని కూడా వాడాల్సి ఉంటుంది. అయితే.. ఏ పిండి ఎంత వాడుతున్నామన్నది చాలా ముఖ్యమని అంటున్నారు. మొత్తం పిండిలో పావు వంతు మైదా పిండి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. ఉదాహరణకు కేజీ పిండితో మీరు పూరీలు చేయాలని అనుకుంటే.. అందులో 750 గ్రాములు గోధుమ పిండి ఉండాలని, మిగిలిన 250 గ్రాములు మైదా పిండి ఉండాలని సూచిస్తున్నారు. ఇలా పిండి మిక్స్ చేసినప్పుడు పూరీలుగా మెత్తగా, పొంగుతూ వస్తాయని చెబుతున్నారు.

చక్కెర..

చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. పూరీల తయారీలో కాస్త చక్కెర కూడా వినియోగిస్తారు. పూరీలు బెలూన్ మాదిరిగా ఉబ్బుతూ రావడానికి చక్కెర ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి.. ఈ పంచదార ఎంత వేయాలి అన్నప్పుడు.. ఉదాహరణకు ఒక కప్పు పూరీ పిండి తీసుకుంటే.. అందులో హాఫ్ స్పూన్ చక్కెర కలుపుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల పూరీలు చక్కగా ఉబ్బడమే కాదు.. మంచి బంగారు రంగులో కూడా వస్తాయి.

సెమోలినా..

సెమోలినా కూడా కాస్త కలుపుకుంటే బాగుంటుంది. సెమోలినా అంటే.. గోధుమల నుంచి తయారైన ఒకరకమైన పిండి. ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. గోధుమ, మైదా పిండి కలుపుకునేటప్పుడే దీన్ని కూడా కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు గోధుమ పిండిలో రెండు స్పూన్ల సెమోలినా వేస్తే సరిపోతుంది. ఇది వేసుకొని పిండిని చక్కగా కలిపి పూరీలు తయారు చేసుకోవాలి.

టాపియోకా పిండి..

చివరగా.. టాపియోకా పిండి కూడా కాస్త ఉపయోగించాల్సి ఉంటుంది. టాపియోకా అంటే మరేదో కాదు.. కర్రపెండలం. దీని పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఉపయోగిస్తే.. పూరీలు చాలా సాఫ్ట్​గా ఉంటాయి. ఇంకా చక్కగా పొంగుతాయి. పిండిని ముద్దలు చేసుకొని.. చపాతీ కర్రతో పూరీల్లా వత్తుకునేటప్పుడు.. పైన ఈ పౌడర్ కాస్త చల్లుకుంటూ రోల్​ చేస్తే సరిపోతుంది.

చక్కగా రోల్​ చేసుకోవాలి..

పూరీ ముద్దను చపాతీ కర్రతో రోల్​ చేస్తున్నప్పుడు.. పూరీ గుండ్రంగా అన్నివైపులా ఒకేవిధంగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవైపు మందంగా, మరో వైపు పలుచగా ఉంటే.. నూనెలో కాల్చుతున్నప్పుడు ఒకేవిధంగా కాలదు. ఒక దగ్గర పూరీ పొంగి, మరోవైపు ఫ్లాట్​గా ఉంటుంది. అందుకే.. అన్నివైపులా ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే.. పూరీలు అచ్చం హోటల్​లో చేసిన విధంగా వస్తాయి. మరి.. ఇంకెందుకు ఆలస్యం రేపు మార్నింగే ఈ టిప్స్ పాటించండి.. చక్కగా ఆస్వాదించండి.

ఇవీ చూడండి :

సూపర్​ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం!

హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్​ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!

ABOUT THE AUTHOR

...view details