తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోలీ స్పెషల్‌ స్వీట్‌ - "గుజియా" ట్రై చేయండి! - How To Make Gujiya Recipe holi

How To Make Gujiya Recipe : హోలీ అంటేనే ఆనందాల కేళీ. ఈ రోజున రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకునే భారతీయులు.. మిఠాయిలతో నోరు తీపి చేసుకుంటారు. అయితే.. చాలా మంది షాపు నుంచి స్వీట్ కొనుగోలు చేస్తుంటారు. కానీ.. ఈ సారి మీరే స్వయంగా తయారు చేసుకోండి! అద్బుతమైన గుజియా స్వీట్​ను ఇంట్లో ప్రిపేర్ చేశారంటే.. హోలీ మరింత టేస్టీగా మారిపోతుంది!

How To Make Gujiya Recipe
How To Make Gujiya Recipe

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 10:43 AM IST

How To Make Gujiya Recipe : పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఎంజాయ్‌ చేసే పండుగలలో హోలీ ఒకటి. దేశవ్యాప్తంగా హోలీ రోజున కుల, మతాలకు అతీతంగా అందరూ ఒక్కటై రంగులు చల్లుకుంటారు. ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అయితే, ఈ సందర్భంగా మనం ఇష్టమైన వారికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపే ముందు, నోరు తీపి చేయడం ఎన్నో ఏళ్ల నుంచి ఆచారంగా వస్తోంది.

మరి, మీరు కూడా ఈ సారి మీ ఆత్మీయులకు ఎలాంటి స్వీట్లు తినిపించబోతున్నారు? ప్రతిసారీ స్వీట్లను బయట నుంచి కొని తీసుకురాకుండా ఈసారి ఇంట్లోనే తయారు చేయండి. ఇందుకోసమే సరికొత్త "గుజియా" స్వీట్‌ రెసిపీని పట్టుకొచ్చాం. మరి ఇంకెందుకు ?ఆలస్యం గుజియా స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూసేద్దాం.

గుజియా స్వీట్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • మైదా 3 కప్పులు
  • నెయ్యి ఒకటిన్నర కప్పు
  • నీళ్లు పావు కప్పు
  • పంచదార కప్పు
  • కోవా 200 గ్రాములు
  • బాదంపప్పు 10 (సన్నగా తరగాలి)
  • బొంబాయిరవ్వ అర కప్పు
  • యాలకుల పొడి అర టీ స్పూన్‌

గుజియా తయారీ విధానం :

  • ముందుగా మైదా పిండిని ఒక గిన్నెలో వేసుకుని, సరిపడినన్ని నీళ్లు, కాస్త నెయ్యి వేసి మెత్తని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి.
  • తర్వాత దీనిపై ఒక తడి క్లాత్‌ కప్పి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి రవ్వను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌ పై పాన్‌ పెట్టి కోవాను వేయించండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన బాదంపప్పులను, యాలకుల పొడి, వేయించిన రవ్వ, చక్కెర అన్నీ వేసుకుని బాగా కలపాలి.
  • ఇప్పుడు మైదా పిండిని చిన్నచిన్న ముద్దులుగా చేసి, చిన్న చపాతీల లాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు గుజియా (కజ్జికాయ) అచ్చుపై వత్తుకున్న చపాతీని వేసి, అందులోకి మనం తయారు చేసుకున్న కోవా, రవ్వ మిశ్రమాన్ని వేయాలి.
  • తర్వాత గుజియా అచ్చు పక్కన ఉన్న మిగతా పిండిని తొలగించాలి. ఇలా పిండిని తొలగిస్తే కజ్జికాయలు మంచి ఆకారంలో వస్తాయి.
  • ఇలా చపాతీలాగా పిండిని వత్తుకుని, మిశ్రమాన్ని కలిపి అన్ని కజ్జికాయలనూ తయారు చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి బాగా వేడి చేయాలి.
  • నూనె వేడిగా ఉన్నప్పుడు అందులో రెడీ చేసి పెట్టుకున్న గుజియాలను వేసి.. బంగారు రంగు వచ్చేంత వరకు దొరగా వేయించుకోవాలి.
  • అంతే.. గుజియా స్వీట్లు రెడీ అయిపోతాయి.
  • వీటిని వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
  • రంగుల కేళీ హోలీ రోజున.. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి

కార్తికపౌర్ణమి స్పెషల్​- పండగ నాడు ఈ స్వీట్స్​ను తయారు చేయండి!

రెండు కేజీల బాహుబలి కజ్జికాయ తినే పోటీ.. ఎంత మంది తిన్నారంటే?

ఇందూరు వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ ​ఘేవర్ స్వీట్

ABOUT THE AUTHOR

...view details