How To Dry Clothes Fast In Rainy Season :బట్టలు ఉతకడం ఒక పని అయితే.. వాటిని ఆరబెట్టి ఇంట్లో సర్దడం మరొక పెద్ద పని. ఇక, వర్షాకాలంలోనైతే ఇదొక పెద్ద సమస్యే! వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఉతికిన బట్టలు సరిగ్గా ఆరవు. దీంతో దుస్తుల నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే.. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా వర్షాకాలంలో ఈజీగా బట్టలను ఆరబెట్టుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డ్రైయింగ్ రాక్, క్లాత్ లైన్ :
వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు ఉతికిన బట్టలను ఇంట్లోనే వెలుతురు, గాలి వచ్చే చోట డ్రైయింగ్ రాక్, క్లాత్ లైన్లను ఏర్పాటు చేసి ఆరబెట్టవచ్చు. ఇలా చేస్తే దుస్తులు త్వరగా ఆరిపోతాయి.
- అలాగే బట్టలను ఆరేసేటప్పుడు వాటి మధ్య కాస్త ఖాళీ ఉంచండి. ఇలా చేస్తే గాలి సర్క్యులేట్ కావడంతో బట్టలు త్వరగా ఆరతాయి.
- తడిగా ఉన్న దుస్తులను ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచండి. ఒక గంట తర్వాత అవే ఆరతాయి.
హెయిర్ డ్రైయర్, డీహ్యుమిడిఫైయర్తో :
బయట రెండు మూడు రోజుల నుంచి చిరుజల్లులతో వర్షం పడుతున్నప్పుడు, అలాగే రెండు మూడు రోజులు తుపాను కారణంగా భారీ వర్షాలున్నప్పుడు ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా బట్టలను ఉతికిన తర్వాత బాగా పిండి.. కొద్దిసేపటి తర్వాత హెయిర్ డ్రైయర్ లేదా డీహ్యుమిడిఫైయర్తో ఆరబెట్టండి. ఇలా చేస్తే త్వరగా దుస్తులు ఆరతాయి. 2004లో 'Applied Thermal Engineering' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. తడి బట్టలను ఆరేయడంలో హెయిర్ డ్రైయర్ బాగా పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని ది హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటికీ చెందిన 'డాక్టర్ Shiming Deng' పాల్గొన్నారు.
వర్షాకాలంలో దుస్తుల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా చేయండి:
- వాషింగ్ మెషిన్లో దుస్తులు వాష్ చేయడానికి ముందుగా డిటర్జెంట్‌లో.. ఒక కప్పు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్‌గా చేతితో దుస్తులు ఉతుకుతున్నట్లయితే.. బట్టలు ఉతికే నీటిలో మీ డిటర్జెంట్‌తో పాటు కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. ఇలా వెనిగర్ యాడ్ చేసుకుని బట్టలను ఉతికితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.
- బట్టలను నానబెట్టిన నీటిలో నిమ్మరసం పిండుకుని తర్వాత ఉతికి ఆరబెట్టుకుంటే దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
- లావెండర్, టీ ట్రీ లేదా యూకలిప్టస్ వంటి కొన్ని రకాల ఎసెన్షియల్ ఆయిల్స్‌లో మీకు నచ్చినది ఎంపిక చేసుకుని.. బట్టలు వాష్ చేసే ముందు వాషింగ్ మెషిన్లో కొన్ని చుక్కలు పోసుకోవాలి.
- లేకపోతే.. ఒక స్ప్రే బాటిల్లో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌ను కొన్ని చుక్కలు తీసుకొని దానికి వాటర్ కలుపుకొని బట్టలు ఆరబెట్టే ముందు వాటిపై లైట్‌గా స్ప్రే చేసుకున్నా దుర్వాసన రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
మీ దుస్తుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా? - ఇలా చేస్తే ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి!
వాషింగ్ మెషీన్లో బట్టలు మాత్రమే కాదు - ఇవి కూడా క్లీన్ చేయొచ్చు!