How Loco Pilot Know Who Pulled Train Chain :మన దేశంలో రోజూ లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్న రవాణా మార్గాలలో రైలుది మొదటి స్థానం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సురక్షితంగా చేరుకోవడానికి.. ఎక్కువ మంది రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపుతారు. దేశంలోని అనేక ప్రాంతాలకు రైలు నెట్‌వర్క్ ఉండటంతో ఎక్కడికి వెళ్లాలన్నా ఈజీగా చేరుకోవచ్చు.
అయితే.. అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపడానికి వీలుగా.. భారతీయ రైల్వే శాఖ చైన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. రైలుకు అనుసంధానించిన ప్రతి బోగిలోనూ ఈ చైన్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ చైన్ లాగితే.. వెంటనే లోకో పైలట్ ట్రైన్‌ను ఆపేస్తాడు. ఈ ఏర్పాటు చాలా సార్లు ప్రయాణికులకు మేలు చేస్తుంది. అయితే.. ఎక్కడో ఒక బోగీలో చైన్ లాగితే.. ఇంకెక్కడో ఇంజన్లో ఉన్న లోకో పైలట్‌కు ఆ విషయం ఎలా తెలుస్తుంది? అంతేకాదు.. సరిగ్గా అదే బోగీ వద్దకు ఎలా వస్తారు? ఎవరు లాగారన్నది ఎలా కనిపెడతారు? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఈ సందేహాలకు ఇక్కడ సమాధానాలు చూద్దాం. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం.
అసలు కథ ఇది!
ప్రతి రైలు బోగిలోనూ ఉండే చైన్ అనేది ఒక ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది. దీనిని అత్యవసర సమయంలో ఎవరైనా లాగవచ్చు. అయితే.. ఏ బోగిలో చైన్ లాగారు అనేది తెలుసుకోవడానికి.. ప్రతి బోగిలోనూ ఒక ఎమర్జెన్సీ ఫ్లాషర్ (లైట్)ను రైల్వే అధికారులు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు ఎవరైనా చైన్‌ను లాగినప్పుడు వెంటనే ఇది ఆన్ అవుతుంది. ఈ ఫ్లాష్ సిగ్నల్ లైట్.. రైలు ఇంజన్లో ఉన్న లోకో పైలట్ దగ్గర కూడా కనిపిస్తుంది. ఏ బోగీలో లాగారనే వివరం అందులో కనిపిస్తుంది. దీంతో లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై.. ట్రైన్‌ను ఆపేస్తారు. ఆ తర్వాత లోకోపైలట్ ఇంజిన్ దిగి.. ఏ బోగిలో చైన్‌ను లాగారో అక్కడికి వెళ్తారు. వారితోపాటు గార్డ్ కూడా వస్తారు.