Gyanvapi Puja Permission : ఉత్తర్‌ప్రదేశ్ కాశీలోని జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని బేస్‌మెంట్‌లో 30ఏళ్ల తర్వాత పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలతో 1993లో నిలిచిన పూజలు తాజాగా జరిగాయి. జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. బారికేడ్లను తొలగించి అధికారులు, సుమారు ఒంటిగంట సమయంలో పూజలు చేసి బయటకు వచ్చారు.
జ్ఞానవాపి ఎదుట పోలీసుల పహరా వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి ప్రాంతంలో పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అర్ధరాత్రి బారికెడ్లను తొలగించారు అధికారులు. బుధవారం రాత్రి 9గంటల తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయ ద్వారం గుండా కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన అధికారులు, అందులోని బారికేడ్లను తొలగించారు. ఆ తర్వాత పరిసరాలను శుభ్రం చేయించారు. ఒంటిగంట సమయంలో గణేశ లక్ష్మి పూజతో ప్రారంభించి, తర్వాత నంది మహారాజ్ ఎదుట పూజలు చేశారు. హారతితో పాటు మంగళ వాయిద్య శబ్దాలు చేసి దీపాలు వెలిగించారు. పూజ కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాక సుమారు 2గంటలకు కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చారు. జిల్లా కోర్టు ఆదేశాలతో పూజలు నిర్వహించామని జిల్లా అధికారి తెలిపారు.
జ్ఞానవాపి ఎదుట పోలీసుల పహరా జ్ఞానవాపి ఎదుట పోలీసుల పహరా "వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలతో నగరవ్యాప్తంగా పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు విశ్వనాథ్ ఆలయం ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించాం. సుమారు 16 పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన బలగాలతో రామనగరం లంక, దశశ్వమేధ్, లక్స సిగార లాంటి ప్రాంతాల్లో భద్రతను పెంచాం."
--అశోక్ కుమార్, పోలీస్ కమిషనర్
అర్ధరాత్రి సుప్రీంకోర్టుకు ముస్లిం ప్రతినిధులు
జ్ఞానవాపి బేస్‌మెంట్‌లో పూజలు చేసిన నేపథ్యంలో ముస్లిం వర్గం ప్రతినిధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పూజలు ప్రారంభించిన వెంటనే నిలిపివేయాలంటూ అర్ధరాత్రి 3గంటలకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్టే విధించేందుకు నిరాకరించారు. అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేయాలని సూచించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ముస్లిం వర్గం ప్రతినిధులు సిద్ధమయ్యారు. మరోవైపు వీరికి బదులుగా హిందూ వర్గం ప్రతినిధులు సైతం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
జ్ఞానవాపి ఎదుట పోలీసుల పహరా అంతకుముందు బుధవారం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో సీల్ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. వారం రోజుల్లోగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. బారికేడ్లు తొలగించాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేసింది. 1993లో అధికారులు భూగర్భ గృహాన్ని మూసివేసే వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ వివాదంతో ఇక్కడ పూజలను నిలిపివేశారు. కోర్టు ఆదేశాలతో సోమనాథ్ వ్యాస్ మనవడైన శైలేంద్రకుమార్ పాఠక్ (పిటిషనరు) ఇపుడు పూజలు చేయనున్నారు.
జ్ఞానవాపి శాస్త్రీయ సర్వే- డబుల్ లాకర్లో 300కుపైగా ఆధారాలు, పురాతన మత చిహ్నాలు సైతం!
'జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఏం చేస్తున్నట్టు? తప్పును వారే అంగీకరించి సరిదిద్దుకోవాల్సింది'